Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:57 AM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. ఈ క్రమంలో ముద్రా రుణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్(Budget 2024)ను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. ఈ క్రమంలో ముద్రా రుణాన్ని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతోపాటు MSME గ్యారెంటీ స్కీమ్ కింద రూ. 100 కోట్ల వరకు రుణాలు లభిస్తాయని చెప్పారు. అంతర్గత మదింపు తర్వాత PSU బ్యాంకులు MSMEలకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. MSMEలకు సహాయం చేయడానికి SIDBI శాఖలను పెంచనున్నారు.
మరోవైపు మహిళల సంబంధిత పథకాల కోసం 3 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. ఈ క్రమంలో MSMEల నుంచి తనఖా లేకుండా రుణాలు పొందవచ్చు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ. 2.66 లక్షల కోట్లు ప్రకటించారు. అంతేకాదు దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని సీతారామన్ తెలిపారు. అలాగే 1,000 ఐటీఐలను హబ్ స్పోక్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ షేర్లన్నీ ఢమాల్..
Economic Survey: ఆర్థిక సర్వే ప్రత్యేకత ఏంటి.. బడ్జెట్‌కు ఒకరోజు ముందే ఎందుకు సమర్పిస్తారు?
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 23 , 2024 | 12:06 PM