Swiss banks: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు.. నల్లధనం వివరాల్లేవు
ABN, Publish Date - Jun 21 , 2024 | 07:36 PM
2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల నిధులు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: 2023లో స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో(Swiss banks) భారతీయ వ్యక్తులు, సంస్థల డిపిజిట్లు 70 శాతం క్షీణించి నాలుగు సంవత్సరాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ కేంద్ర వార్షిక డేటా బ్యాంకు వెల్లడించింది. 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల(రూ. 9,771 కోట్లు) కనిష్టానికి డిపాజిట్లు చేరుకున్నాయని నివేదికలో తెలిపింది. 2021లో 14 ఏళ్ల గరిష్ట స్థాయి CHF(స్విడ్జర్లాండ్ అధికారిక కరెన్సీ) 3.83 బిలియన్‌లను తాకి రెండో ఏడాది డిపాజిట్లు తగ్గిపోయాయి.
అంతేకాకుండా, కస్టమర్ డిపాజిట్ ఖాతాలలోని మొత్తం, భారత్‌లోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా ఉన్న డిపాజిట్లు కూడా గణనీయంగా తగ్గాయని డేటా స్పష్టం చేసింది. బ్యాంకులు స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB)కి ఇచ్చిన గణాంకాల ప్రకారం ఈ నివేదిక రూపొందించారు. దీంతోపాటు స్విట్జర్లాండ్‌లో భారతీయులు కలిగి ఉన్న నల్లధనం వివరాల్ని నివేదిక వెల్లడించలేదు.
భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు లేదా స్విస్ బ్యాంకుల్లో థర్డ్ కంట్రీ ఎంటిటీల పేర్లతో ఉన్న డబ్బు కూడా ఈ గణాంకాల్లో పేర్కొనలేదు.2023లో యూకే 254 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో(CHF) UK అగ్రస్థానంలో ఉండగా, అమెరికా(CHF 71 బిలియన్) రెండో స్థానంలో, ఫ్రాన్స్ (CHF 64 బిలియన్) మూడో స్థానంలో ఉంది.
వీటి తరువాత వెస్టిండీస్, జర్మనీ, హాంకాంగ్, సింగపూర్, లక్సెంబర్గ్, గ్వెర్న్సీలు టాప్ 10లో ఉన్నాయి. డిపాజిట్లపరంగా 2022లో 46వ స్థానంలో ఉన్న భారత్ గతేడాది 67వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కూడా CHF 286 మిలియన్లకు (CHF 388 మిలియన్ల నుండి) పడిపోయింది. బంగ్లాదేశ్ CHF 55 మిలియన్ల నుండి CHF 18 మిలియన్లకు పడిపోయింది.
Updated Date - Jun 21 , 2024 | 07:51 PM