ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Flight Journey: సామాన్యుడికి అందుబాటులో ఫ్లైట్ జర్నీ

ABN, Publish Date - May 31 , 2024 | 12:58 PM

దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ విమానాలలో ప్రయాణించేందుకు(travel) రూ.1,199, అంతర్జాతీయ విమానాలకు రూ.4,499 చెల్లిస్తే చాలని తెలిపింది. మీరు ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చులతో సెలవులకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది.

Indigo Hello Summer Sale Offers Travel by flight for Rs 1199

దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ విమానాలలో ప్రయాణించేందుకు(travel) రూ.1,199, అంతర్జాతీయ విమానాలకు రూ.4,499 చెల్లిస్తే చాలని తెలిపింది. మీరు ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చులతో సెలవులకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. మే 29 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 31 వరకు కొనసాగనుంది. ఈ తక్కువ ఛార్జీలను పొందడానికి ఈ వ్యవధిలోనే మీరు మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఈ ప్రత్యేక ఛార్జీలు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు మధ్య ప్రయాణించే విమానాలకు వర్తిస్తాయి. అయితే ఈ తక్కువ ధరలు విమానాశ్రయ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులు, రుసుములకు వర్తించవు. అలాగే ఈ ఆఫర్ కింద లభించే ప్రత్యేక ఛార్జీల టిక్కెట్‌లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయని కంపెనీ వర్గాలు (Indigo) తెలిపాయి.


గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏప్రిల్‌లో మార్కెట్ వాటా 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగిందని ఈ ఎయిర్‌లైన్(airline) నివేదించింది. ఇది ప్రస్తుతం 60.6% మార్కెట్ వాటాను కలిగి ఉండి భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతుంది. ఇండిగో ఏప్రిల్ నెలలోనే 80 లక్షల మంది ప్రయాణికులను విజయవంతంగా వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఇది భారతీయ విమానయాన పరిశ్రమలో వారి కీలక పాత్రను పోషించిందని చెప్పవచ్చు.


ఇది కూడా చదవండి:

Indias Juggernaut: అత్యంత ప్రభావవంతమైన కంపెనీల లిస్టు విడుదల చేసిన 'టైమ్'.. భారత్ నుంచి ఏవంటే?

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 31 , 2024 | 01:16 PM

Advertising
Advertising