Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
ABN, Publish Date - Sep 04 , 2024 | 05:58 PM
కోటీశ్వరులు కావాలని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీనిని కొంత మంది మాత్రమే అచరించి ప్రణాళిక ప్రకారం చేరుకుంటారు. దీనికోసం మీరు ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రోజు ఓ 250 రూపాయలు పక్కన పెడితే చాలు. మీరు కోటీశ్వరులు కావచ్చు. ఎది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కరోనా తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లలో(stock market) విపరీతమైన ఒడిదుడుకులు కనిపించాయి. కానీ గత కొద్ది రోజులుగా మార్కెట్‌లో మంచి కదలిక కనిపిస్తోంది. ఇదే సమయంలో పెట్టుబడిదారులు కూడా మంచి రాబడులను కోరుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి(investments) పెట్టడం బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ SIP ఎంపికలో మీరు నెలవారీ ప్రాతిపదికన దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడం వల్ల పెద్ద మొత్తాలను పొందవచ్చు. ముందుగా మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దేని కోసం పెట్టుబడి చేయాలనేది నిర్ణయించుకోండి. అలా అని పెట్టుబడి కోసం పెద్ద మొత్తంలో అవసరం లేదు. మీరు రోజు చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో మీరు తక్కువ మొత్తంలో పొదుపు చేసి దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే విధానాన్ని ఇప్పుడు చుద్దాం.
రోజు రూ.250
ఈ క్రమంలో మీరు రోజు కనీసం రూ.250 ఆదా చేశారనుకుందాం. ఆ విధంగా నెలలో రూ. 7500 సేవ్ చేయవచ్చు. ఆ మొత్తాన్ని సిప్ విధానంలో పెట్టుబడి పెడితే మీరు 20 ఏళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. ఈ నేపథ్యంలో మీరు చేసే మొత్తం పెట్టుబడి 20 ఏళ్లకు గాను రూ.18,00,000 అవుతుంది. కానీ 20 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం 15 శాతం వార్షిక రాబడి ప్రకారం రూ.1,13,69,662 వస్తుంది. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 95,69,662 లభించే అవకాశం ఉంటుంది.
మనీ డబుల్
ఒకేవేళ మీరు మీ పెట్టుబడిని 25 ఏళ్లకు పొడిగిస్తే మీకు వచ్చే రాబడి డబుల్ అవుతుంది. ఈ క్రమంలో మీరు చేసే పెట్టుబడి రూ. 22,50,000 అవుతుంది. దీంతో మీకు 25 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం 15 శాతం వార్షిక రాబడి ప్రకారం రూ. 2,46,30,553 వస్తుంది. ఈ క్రమంలో మీకు వడ్డీ రూపంలోనే 2 కోట్ల 23 లక్షల 80 వేల 553 రూపాయలు లభిస్తాయి. అయితే మీ కెరీర్ ప్రారంభ దశలో దీర్ఘ కాలిక సమయంలో పెట్టుబడి చేస్తే భారీ ప్రయోజనాలను పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తాన్ని దక్కించుకోవచ్చు.
గమనిక: మ్యూచువల్ ఫండ్స్ సిప్ విధానంలో పెట్టుబడులు చేసే విషయంలో నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం తప్పనిసరి. పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని ఆశతో సూచనలు లేకుండా పెట్టుబడులు చేయోద్దు.
ఇవి కూడా చదవండి:
Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు
Next Week IPO: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి
Read More Business News and Latest Telugu News
Updated Date - Sep 04 , 2024 | 06:00 PM