మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

ABN, Publish Date - Apr 03 , 2024 | 09:38 AM

మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే(IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. దీనిలో గుజరాత్‌లోని అహ్మదాబాద్, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న వడోదర, శ్రీకృష్ణుడు ఏలిన నగరం ద్వారకా, రాజ్‌కోట్, సోమనాథ్ వంటి నగరాలను కవర్ చేస్తున్నారు. IRCTC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్యాకేజీ 8 రోజుల పాటు 7 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి బుధవారం ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్(secunderabad) నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఈ ట్రైన్ మొదలవుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఈసారి రూ.లక్ష కోట్ల ఐపీఓలు!


ఈ ప్యాకేజీలో భాగంగా ముందుగా ట్రైన్ వడోదర(Vadodara) చేరుకుంటుంది. ఆ తర్వాత రెండో రోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్దకు తీసుకువెళతారు. మూడో రోజు లక్ష్మీ విలాస్ ప్యాలెస్, అక్షరధామ్ ఆలయానికి తీసుకెళ్లనున్నారు. నాల్గవ రోజు, ప్రయాణికులు సబర్మతి ఆశ్రమం, వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయానికి వెళతారు. ఐదవ రోజు, వారు ద్వారక(Dwarka), సోమనాథ్ ఆలయానికి తీసుకువెళతారు. రాత్రి పోర్ బందర్ ఆలయం నుంచి స్వామి నారాయణ్ ఆలయానికి బయలుదేరుతారు. ఆరో రోజు పోర్ బందర్, కీర్తి మందిర్, సుధామ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఏడో రోజు పోర్ బందర్ నుంచి సికింద్రాబాద్‌(secunderabad)కు రాత్రి 12.05 నిమిషాలకు తిరుగు ప్రయాణం. ఎనిమిదో రోజు ఉదయం 08:20 గంటలకు ట్రైన్(train) సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ముగ్గురు వ్యక్తులు(Triple Sharing) ఉన్న కుటుంబం పర్యటనకు వెళితే వారు ఒక్కొక్కరికి రూ. 27,610 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులు(Twin Sharing) ఉంటే ఒక్కొక్కరికి రూ. 28,280, అదే సాధారణ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తే వీటి ధరలు రూ.25,430. ముగ్గురు వ్యక్తులు అయితే ఒక్కొక్కరికి రూ. 24,760. భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో హోటల్, ఆహారం, పానీయాల కోసం మీరు చెల్లించాల్సిన పనిలేదు. ఇవన్నీ కూడా ప్యాకేజీ(package)లో భాగంగానే ఉంటాయి. దీని కోసం మీరు ప్యాకేజీ టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకోవాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మన మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ సబబే

Updated Date - Apr 03 , 2024 | 09:44 AM

Advertising
Advertising