ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

July 17th: ఈ ప్రాంతాల్లో జులై 17న పబ్లిక్ హాలిడే.. కారణమిదే

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:59 AM

జులై 17న(July 17th) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే(public holiday) ఉంది. అయితే ఈసారి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలోని 10వ రోజున మొహర్రం/ఆషురా పండుగను జులై 17న జరుపుకుంటారు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఈరోజున సెలవు ప్రకటించాయి. అయితే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రం హాలిడే లేదు.

July 17th 2024 public holiday

జులై 17న(July 17th) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే(public holiday) ఉంది. అయితే ఈసారి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలోని 10వ రోజున మొహర్రం/ఆషురా పండుగను జులై 17న జరుపుకుంటారు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలు ఈరోజున సెలవు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణలో కూడా జులై 17న హాలిడే. ఈ క్రమంలో పలు ప్రైవేటు సంస్థలతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోజు తెరవబడవు. సెలవు దినాల్లో పని చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.


ఈ ప్రాంతాల్లో మాత్రమే

జులై 17న ఉత్తరాఖండ్, గుజరాత్, ఒడిశా, చండీగఢ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, ఇటానగర్, కేరళ, నాగాలాండ్, గోవా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు(Bank holiday) ఉంటుందని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక స్కూల్స్ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, కేరళ, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పాండిచ్చేరి, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరవబడవు.


అందుకే ఈ పండుగ

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం(Muharram festival) ఇస్లాం మొదటి నెల. బక్రీద్ పండుగ 20 రోజుల తర్వాత మొహర్రం వస్తుంది. ఈసారి అషురా లేదా మొహర్రం జులై 17న జరుపుకుంటారు. ఇస్లాం ప్రజలకు ఈ నెల చాలా ప్రధానమైనది. ఎందుకంటే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఈ నెలలో అమరవీరుడయ్యారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఇస్లాం మతాన్ని స్థాపించిన హజ్రత్ ముహమ్మద్ సాహిబ్ చిన్న మనవడు. ఆయన బలిదానం జ్ఞాపకార్థం, ప్రజలు మొహర్రం నెల పదవ రోజును సంతాప దినంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో కర్బలా అమరవీరులకు సంతాపంగా ఈ పండుగను ప్రతి ఏటా నిర్వహించుకుంటారు. ఇందుకోసం షియా ముస్లింలు నల్లని దుస్తులు ధరించి ఇళ్లలో, మసీదుల్లో జరిగే సంతాప సభలకు హాజరవుతారు.


ఇది కూడా చదవండి:

Stock Market: జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా..


Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు

విద్యార్థుల కోసం ఐసీఐసీఐ సఫీరో ఫారెక్స్‌ కార్డ్‌


For Latest News and Business News click here

Updated Date - Jul 03 , 2024 | 11:07 AM

Advertising
Advertising