ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వృధా చేసుకున్నట్లే..

ABN, Publish Date - Jun 06 , 2024 | 09:46 AM

జీవితంలో భద్రత కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏమైనా జరిగినా.. లేదంటే పొదుపు కోసం కూడా ఎక్కువ మంది బీమా తీసుకుంటారు. సాధారణంగా బీమా తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా కొంతమంది తొందరపడి ఇన్సూరెన్స్ తీసుకుంటారు.

LIC Policy

జీవితంలో భద్రత కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏమైనా జరిగినా.. లేదంటే పొదుపు కోసం కూడా ఎక్కువ మంది బీమా తీసుకుంటారు. సాధారణంగా బీమా తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా కొంతమంది తొందరపడి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. రెండు, మూడు నెలలు కట్టిన తర్వాత కొందరు ఆపేస్తుంటారు. దీంతో డబ్బులు వృధా అవుతాయి. అందుకే సంపాదన, వయసు, భవిష్యత్తు ఆలోచన ఆధారంగా కవరేజీని ఎంచుకోవల్సి ఉంటుంది. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న ప్రీమియం చెల్లించడానికి భారం కాకుండా ఉండేలా ఉంటే ఆ వ్యక్తి పూర్తికాలం పాలసీని కొనసాగించే అవకాశం ఉంటుంది. స్థోమతకు మించి ప్రీమియాన్ని ఎంచుకుంటే పూర్తికాలం చెల్లించలేక, మధ్యలోనే పాలసీని ఆపేసే పరిస్థితులు ఏర్పడతాయి. పాలసీని ఎంచుకునేటప్పుడు అన్ని విషయాలను ఆలోచించుకోవాలి. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న కవరేజీ, కాలపరిమితి ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని లెక్కిస్తారు. జీవిత బీమా సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీ తీసుకునే వ్యక్తి మధ్య జరిగే ఒప్పందం. వ్యక్తి జీవితకాలంలో పాలసీదారు చెల్లించిన ప్రీమియానికి బదులుగా బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు నామినీకి బీమా కవరేజీని చెల్లించడానికి సంస్థ హామీ ఇస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దరఖాస్తులో బీమా చేసే వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను తెలియజేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ముందుగానే పేర్కొనాలి. వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, వయస్సు ఆధారంగా అనేక రకమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయానికి అనుమతి


కాలపరిమితి

జీవిత బీమా పాలసీ యొక్క కాలపరిమితిని ఎంచుకోవడం ముఖ్యమైన అంశం. పదవీ విరమణ వయస్సులోంచి బీమా చేసే వ్యక్తి వయసను ను తీసివేయాలి. ఉదాహరణకు ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అనుకోండి.. 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాలనుకుంటే పాలసీ వ్యవధిని 60-30= 30 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండేలా ఎంచుకోవాలి.


స్పష్టత అవసరం

పాలసీ తీసుకునేటప్పుడు ఏ అవసరాల కోసం తీసుకుంటున్నామో స్పష్టత ఉండాలి. కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడటం వ్యక్తి యొక్క ప్రాథమిక లక్ష్యం అయితే.. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.


కవరేజి ఎంత..

వ్యక్తి ఎంచుకున్న పాలసీ కవరేజ్ ఎంత అనేదానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్లు జీవిత బీమా కవరేజిని కలిగి ఉండటం మంచిది.


చిన్న వయస్సులోనే..

చిన్న వయస్సులో ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే మీ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం భారంగా అనిపించదు.


మందగించిన సేవల రంగం వృద్ధి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jun 06 , 2024 | 09:46 AM

Advertising
Advertising