ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

ABN, Publish Date - Feb 23 , 2024 | 12:41 PM

Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.

LiquiLoans

Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు. అవును, బ్యాంకులకు రుణాలు ఇచ్చి.. వాటి నుంచి వచ్చే వడ్డీ ద్వారా భారీగా సంపాదించుకోవచ్చు.

వాస్తవానికి బ్యాంకింగ్ వ్యవస్థ డిమాండ్, సరఫరా సూత్రం చాలా సరళంగా ఉంటుంది. బ్యాంక్‌లో అకౌంట్ తెరిచిన తరువాత చాలా మంది ప్రజలు తమ డబ్బును అందులో డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో రుణాలు కావాలనుకునే వారికి బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. వీటికి వడ్డీ వసూలు చేస్తాయి. తద్వారా బ్యాంకులకు ఆదాయం వస్తుంది. డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులకు కూడా కొంత మొత్తంలో వడ్డీ లభిస్తుంది. మరి మీరే బ్యాంకులకు రుణం ఇస్తే.. ఆ రుణాలకు భారీగా వడ్డీ లభిస్తే.. అవును, ఈ విధానంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే కూడా వడ్డీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానం ఆర్బీఐ నియంత్రణలో ఉంది.

బ్యాంకులో అప్పు ఇచ్చి డబ్బు సంపాదించండి..

వాస్తవానికి 'లిక్విలోన్స్' అనేది RBI నియంత్రిత NBFC. ఇది పీర్ 2 పీర్ లోన్ ప్రొవైడర్‌గా పనిచేస్తుంది. ఈ NBFC రుణదాతలు, రుణగ్రహీతలకు ఒక వేదికను అందిస్తుంది. ఇందులో, రుణదాత తన పెట్టుబడిపై మంచి రాబడిని పొందుతాడు. ఈ ఎన్‌బిఎఫ్‌సి ఇప్పటివరకు రూ. 4400 కోట్ల కంటే ఎక్కువ విలువైన రుణాలను అందించింది. సాధారణంగా, ఈ సంస్థ ప్రజల నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి.. ఇతరులకు వడ్డీకి ఇస్తుంది. కంపెనీ సాధారణంగా నో-కాస్ట్ EMI లేదా చిన్న రుణాలకు ప్రాధాన్యత ఇస్తుంది.

వడ్డీ ద్వారా మంచి ఆదాయం..

ఈ RBI నియంత్రిత NBFC ద్వారా మీ డబ్బును లోన్‌పై ఇస్తే.. వడ్డీ ద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందుతారు. ఇందులో పెట్టుబడిపై 8 శాతం వరకు వడ్డీని లభిస్తుంది. ఇది సాధారణంగా FD కంటే మెరుగైనది. అయితే, పెట్టుబడి పెట్టే ముందు అన్ని డాక్యూమెంట్స్‌పై క్లియర్‌గా చదవాలి. తద్వారా నియమాలు, నిబంధనల గురించి సరైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రక్రియ కూడా చాలా సులభం. గూగుల్‌లో Liquiloanని సెర్చ్ చేసి.. అందులో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తరువాత అడిగిన వివరాలను నమోదు చేసి.. ఇన్వెస్ట్ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 12:41 PM

Advertising
Advertising