ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lowest Home Loan: ఈ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేటుకే హోమ్ లోన్స్!

ABN, Publish Date - Apr 07 , 2024 | 10:35 AM

మీరు మొదటిసారిగా హోమ్ లోన్(home loan) తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గృహ రుణం విషయంలో వడ్డీ రేటు(interest rates) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఏ బ్యాంకుల్లో(banks) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయో ఇక్కడ చుద్దాం.

మీరు మొదటిసారిగా హోమ్ లోన్(home loan) తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గృహ రుణం విషయంలో వడ్డీ రేటు(interest rates) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఏ బ్యాంకుల్లో(banks) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ క్రమంలో మీకు తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం ఇచ్చే బ్యాంకును ఎంచుకుంటే మీకు సౌలభ్యంగా ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు మీ ఆదాయం, లోన్ రీపేమెంట్ సామర్థ్యం మీ లోన్(loan) అర్హతను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.


అంతేకాదు బ్యాంకుల నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు(home loan interest rates) రుణం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి క్రెడిట్ స్కోర్, మొత్తం రుణం, కాల వ్యవధిని బట్టి కూడా నిర్ణయిస్తారు. మీ ఆస్తులు, అప్పులు, మీ పొదుపు చరిత్ర, మీ ఉద్యోగ భద్రత మొదలైనవి కూడా రుణం పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

10 బ్యాంకుల్లో గృహ రుణ వడ్డీ రేట్లు (ఏప్రిల్ 7, 2024 నాటికి) (రూ. 30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు)

1. బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లు 8.30% నుంచి 10.75% వరకు ఉన్నాయి

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లు 8.35% నుంచి 10.90% వరకు ఉన్నాయి

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.35% నుంచి 11.15% వరకు ఉన్నాయి

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గృహ రుణ వడ్డీ రేట్లు 8.40% నుంచి 10.05% వరకు ఉన్నాయి

5. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.40% నుంచి 10.15% వరకు ఉన్నాయి

6. UCO బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.45% నుంచి 10.30% వరకు ఉన్నాయి

7. HDFC బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.50% నుంచి ప్రారంభం

8. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.70% నుంచి ప్రారంభం

9. ICICI బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.75% నుంచి ప్రారంభం

10. యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.75% నుంచి ప్రారంభం


ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యల్ప గృహ రుణ వడ్డీ రేట్లను సంవత్సరానికి 8.30 శాతం నుంచి అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, LIC హౌసింగ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై సంవత్సరానికి 8.35 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. గృహ రుణ దరఖాస్తుదారులకు అందించే చివరి వడ్డీ రేట్లు వారి క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, వృత్తి ప్రొఫైల్ సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Price: పైపైకి వెళ్తున్న పుత్తడి రేట్లు..నేటి ధరలు ఏంతంటే


Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 07 , 2024 | 10:38 AM

Advertising
Advertising