ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Insurance: ప్రమాదకర స్థాయిలో జీవిత బీమా పాలసీలు.. ఇబ్బందుల్లో పాలసీదారులు?

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:20 PM

దేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తిని పెంచాలని ఒత్తిడి చేస్తున్న తరుణంలో బీమా పాలసీలను తప్పుగా అమ్మడం ప్రమాదకర స్థాయికి చేరుకుందని IRDAI సభ్యుడు సత్యజిత్ త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులను అమ్మే విషయంలో ఫిర్యాదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Mis selling insurances

ఇటివల కాలంలో దేశంలో ప్రతి కుటుంబానికి బీమా(insurance) ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు దానిని సాధించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కరోనా వచ్చిన తర్వాత బీమా చేయించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే బీమా ఉత్పత్తులను అమ్మే విషయంలో పలు కంపెనీలు మాత్రం నిబంధనలు పాటించడం లేదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యుడు సత్యజిత్ త్రిపాఠి అన్నారు. ఈ క్రమంలో పాలసీదారుల నుంచి ప్రతి ఏటా వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని గుర్తు చేశారు.


ఫిర్యాదులు

2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి IRDAI వార్షిక నివేదికలో బీమా భరోసా పోర్టల్‌కు వచ్చిన ఫిర్యాదుల వివరాలను సత్యజిత్ త్రిపాఠి అందించారు. ఈ క్రమంలో మొత్తం 1,24,293 ఫిర్యాదులు రాగా, వాటిలో అన్యాయమైన వ్యాపార ఉత్పత్తులకు సంబంధించినవి 20 శాతం ఉండగా, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి క్లెయిమ్ చెల్లింపునకు సంబంధించిన ఫిర్యాదులు 66 శాతం ఉన్నాయన్నారు. వీటి సంఖ్య 78,347 ఉందని వెల్లడించారు. క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులు జీవిత బీమా రంగంలో కంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఎక్కువగా ఉందని త్రిపాఠి అన్నారు.


క్లెయిమ్ సహా

క్లెయిమ్‌లను తిరస్కరించడం నుంచి తక్కువ క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం వరకు ఇలా అనేక అంశాలు వీటిలో ఉన్నట్లు త్రిపాఠి వెల్లడించారు. చాలా ఫిర్యాదులు ఆరోగ్య బీమాకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్, ఇతర వాటాదారులు ఆరోగ్య బీమా కోసం నగదు రహిత సౌకర్యాలను రూపొందించడంలో చేస్తున్న కృషి వల్ల అనేక మందికి త్వరలోనే ఆరోగ్య బీమా వర్తిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన CII ఫైనాన్షియల్ సమ్మిట్ 3.0లో త్రిపాఠి మాట్లాడిన క్రమంలో మంగళవారం వెల్లడించారు.


పెరిగిన రేట్లు

ఇటివల నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంను మేలో 15.5% పెంచారు. ఈ క్రమంలో పాలసీదారుల క్లెయిమ్ చెల్లింపులు, మినహాయింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా కంపెనీలు తప్పనిసరిగా పరిష్కరించాలి. అయితే ఫిర్యాదులు పరిష్కరించడంలో ఆలస్యమైతే పాలసీ తీసుకున్న వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. వీటిని సకాలంలో పరిష్కరిస్తే ఆ పాలసీదారుల కుటుంబానికి మేలు జరుగుతుంది. మరోవైపు పలు కంపెనీలు అబద్ధాలు చెప్పి పాలసీలను విక్రయిస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయా ఉత్పత్తులకు సంబంధించి పూర్తి నిజాలు చెప్పకుండా విక్రయిస్తున్నారని అంటున్నారు. దీని వల్ల చివరకు పాలసీ క్లైయిమ్ సమయంలో వివాదాలు పెరిగి ఫిర్యాదుల వరకు వెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు


Next Week IPO: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 04 , 2024 | 04:36 PM

Advertising
Advertising