ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

ABN, Publish Date - Jan 19 , 2024 | 06:47 PM

అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

అయోధ్య(Ayodhya)లో రామ మందిర్(Ram Mandir) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలోని బ్యాంకులు ఆ రోజున హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఆ రోజున మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున మనీ మార్కెట్ సమయాల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Smart Watches Offers: రూ.2 వేలలోపు టాప్ 5 స్మార్ట్‌వాచ్‌లు...86% డిస్కౌంట్ కూడా

జనవరి 22న కరెన్సీ మార్కెట్లు ఉదయం 9 గంటలకు బదులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జనవరి 22న ప్రభుత్వం సగం రోజుల సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్పు ఫారెక్స్, బాండ్ మార్కెట్‌కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేస్తూ ఆర్బీఐ(RBI) వెల్లడించింది.

జనవరి 22, 2024న అయోధ్యలో రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకను భారతదేశం(bharat) అంతటా ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా భారతదేశం అంతటా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు జనవరి 22, 2024 మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు.

Updated Date - Jan 19 , 2024 | 11:33 PM

Advertising
Advertising