Moodys: 2024లో భారత్ జీడీపీ భారీగా తగ్గించిన మూడీస్..ఎందుకిలా
ABN, Publish Date - Apr 12 , 2024 | 02:45 PM
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. అయితే కరోనా కారణంగా భారతదేశం, ఆగ్నేయాసియా సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి సంస్థలు నష్టాలను చవిచూశాయని తెలిపింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో వృద్ధి మందగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు ఇండియా, చైనాలో ద్రవ్యోల్బణం కూడా వృద్ధిపై ప్రభావం చూపనుందని చెప్పింది.
మరోవైపు దక్షిణ, ఆగ్నేయాసియాలోని ఆర్థిక వ్యవస్థలు ఈ సంవత్సరం బలమైన లాభాలను చూస్తాయని వెల్లడించింది. మూడీస్(Moodys) అనలిటిక్స్ 'APAC Outlook: Listening through the Noise' పేరుతో తన నివేదికను వెల్లడించింది. మొత్తం మీద ఈ ప్రాంతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని నివేదిక పేర్కొంది. APAC (ఆసియా పసిఫిక్) ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3.8 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలుపగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
ఇప్పటికే ఆహార ధరల అనిశ్చితి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో 4.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంది. ఇది కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వస్తువుల ధరలు, సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 12 , 2024 | 03:00 PM