Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు.. లిస్ట్ కానున్న కంపెనీలివే
ABN, Publish Date - Oct 06 , 2024 | 06:26 PM
ఐపీఓల వారం మళ్లీ వచ్చింది. ఈసారి అక్టోబర్ 7 నుంచి మొదలయ్యే వారంలో 2 కొత్త IPOలు సహా పలు కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. ఆ కంపెనీలు ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో (stock market) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. అయితే అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రైమరీ మార్కెట్ కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి 2 కొత్త IPOలు మాత్రమే తెరవబోతున్నాయి. వీటిలో ఒకటి గరుడ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ IPO మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఇది కాకుండా కొత్త వారంలో ఇప్పటికే ప్రారంభించిన IPOలలో కూడా డబ్బు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఆ వివరాలేంటి, రాబోయే వారంలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్న కంపెనీలు ఏంటనే విషయాన్ని ఇక్కడ చుద్దాం.
గరుడ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ IPO: మెయిన్‌బోర్డ్ విభాగంలో రూ. 264.10 కోట్ల ఈ ఇష్యూ అక్టోబర్ 8న ప్రారంభమై, అక్టోబర్ 10న ముగుస్తుంది. షేర్లు అక్టోబరు 15న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేయబడతాయి. ఈ IPOలో బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 92-95. లాట్ పరిమాణం 157 షేర్లు.
శివ్ టెక్స్‌కెమ్ IPO: రూ. 101.35 కోట్ల ఈ ఇష్యూ అక్టోబర్ 8న ప్రారంభమై, అక్టోబర్ 10న ముగుస్తుంది. అక్టోబరు 15న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో షేర్లు లిస్ట్ కానున్నాయి. బిడ్డింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 158-166. లాట్ పరిమాణం 800 షేర్లు.
ఇప్పటికే ప్రారంభం
ఇప్పటికే ప్రారంభమైన ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ IPOలో నవంబర్ 8 వరకు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 99. లాట్ సైజు 1200 షేర్లు. IPO ముగిసిన తర్వాత షేర్లు అక్టోబర్ 11న BSE SMEలో జాబితా చేయబడతాయి. దీంతోపాటు సాజ్ హోటల్స్, HVAX టెక్నాలజీస్ షేర్లు అక్టోబర్ 7న NSE SMEలో లిస్ట్ చేయబడతాయి.
సుబామ్ పేపర్స్, పారామౌంట్ డై టెక్ అక్టోబర్ 8న BSE SMEలో జాబితా చేయబడతాయి. నియోపాలిటన్ పిజ్జా ఫుడ్స్ షేర్లు అక్టోబర్ 9న BSE SMEలో లిస్ట్ చేయబడతాయి. ఇటీవలే తమ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియలను పూర్తి చేసుకున్న పలు కంపెనీలు ఇప్పుడు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 06 , 2024 | 06:28 PM