ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market Updates: 1879 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్..భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ABN, Publish Date - Mar 13 , 2024 | 12:41 PM

దేశీయ షేర్ మార్కెట్లో బేర్ జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో దాదాపు సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఒక దశలో ఏకంగా 1,879 పాయింట్లు కోల్పోయింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం (మార్చి 13న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీలో భారీ పతనం ఉండగా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఆల్ రౌండ్ క్షీణత కనిపిస్తోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో దాదాపు 4 శాతం క్షీణించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 4 శాతానికి పైగా పడిపోయింది.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 నిమిషాల నాటికి సెన్సెక్స్(sensex) ఏకంగా 721 పాయింట్లు పడిపోయి 72,946 వద్దకు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 246 పాయింట్లు క్షీణించి 22,059కి చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 231, 1879 పాయింట్లు నష్టపోయాయి. ఇక సెక్టోరల్ ఇండెక్స్‌లో ఎఫ్‌ఎంసీజీ మాత్రమే గ్రీన్‌లో ఉంది. ఈ క్రమంలో టాప్ లూజర్లలో అదానీ ఎంటర్‌ప్రైస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, NTPC, కోల్ ఇండియా ఉండగా టాప్ 5 లాభాల సంస్థల స్టాక్స్‌లలో ITC, కోటక్ మహీంద్రా, ICICI బ్యాంక్, బ్రిటానియా, నెస్లే ఉన్నాయి.


అయితే ఫిబ్రవరిలో దేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం(inflation) స్వల్పంగా తగ్గడం సహా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు తగ్గడం వంటి అంశాలు ప్రతికూల ధోరణిని సూచించాయి. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్ని పరిస్థితులు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠం

Updated Date - Mar 13 , 2024 | 12:42 PM

Advertising
Advertising