ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitharaman: పాత ఈవీలపై 18% జీఎస్‌టీ

ABN, Publish Date - Dec 22 , 2024 | 02:09 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన 55వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పాప్‌కార్న్‌పై ఫ్లేవర్‌ ఆధారంగా పన్ను .. విమాన ఇంధనంపై పన్ను రాష్ట్రాల చేతిలోనే..

జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్‌టీ తగ్గింపు వాయిదా

జీన్‌ థెరపీకి జీఎ్‌సటీ మినహాయింపు

ఫోర్టిఫైడ్‌ బియ్యంపై 5 శాతం పన్ను

55వ జీఎ్‌సటీ మండలి సమావేశంలో కీలక

నిర్ణయాలు

జైసల్మేర్‌: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన 55వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాడిన లేదా పాత విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై పన్నును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని మండలి నిర్ణయించినట్లు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతారామన్‌ వెల్లడించారు. కంపెనీలు కొనుగోలు చేసిన పాత ఈవీలు లేదా విక్రేతలు మోడిఫై చేసి విక్రయించే ఈవీల మార్జిన్‌ విలువ (కొనుగోలు, విక్రయ ధర మధ్య వ్యత్యాసం)పైనే పన్ను వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పాత ఈవీ కొనుగోలు లావాదేవీకి ఎలాంటి పన్ను వర్తించదని కూడా తెలిపారు. ప్రస్తుతం కొత్త ఈవీలపై జీఎ్‌సటీ 5 శాతంగా ఉంది. ఈవీయేతర వాహనాల విషయానికొస్తే, వ్యాపారులు విక్రయించే పాత లేదా వాడిన చిన్న పెట్రోల్‌, డీజిల్‌ కార్ల మార్జిన్‌ విలువపై 18 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుంది.

బీమా..లేదు ఊరట: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎ్‌సటీ తగ్గించాలన్న ప్రతిపాదనపై మండలి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీమా రంగ నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ అభిప్రాయం తెలపాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు మంత్రి తెలిపారు.

రేట్ల హేతుబద్ధీకరణపై నివేదిక వాయిదా జీఎ్‌సటీ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) తన నివేదికను వాయిదా వేసింది. వాస్తవానికి, జీఓఎం శనివారం మండలికి నివేదిక సమర్పించాల్సి ఉంది. మండలి తదుపరి సమావేశంలో నివేదిక సమర్పిస్తామని జీఓఎం కన్వీనర్‌, బిహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి తెలిపారు. పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎ్‌సటీతో పాటు మొత్తం 148 ఉత్పత్తులపై జీఎ్‌సటీ రేట్ల సవరణను ఈ ప్యానెల్‌ ప్రతిపాదించింది.


పర్యావరణ విపత్తు సెస్సు.. జీఓఎం ఏర్పాటు

పర్యావరణ విపత్తు కారణంగా భారీగా నష్టపోయిన రాష్ట్రాలు జీఎ్‌సటీలో భాగంగా ప్రత్యేక సుంకం విధించేందుకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేయాలని జీఎ్‌సటీ మండలి నిర్ణయించింది. పర్యావరణ విపత్తు నష్టాల నుంచి తేరుకునేందుకు విలాస వస్తువులపై 1ు సెస్సు విధించేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ విషయంపై జీఓఎంను ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రి పయ్యావుల కేశవులు కూడా అంగీకరించారని మంత్రి నిర్మల తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, పశ్చి మ బెంగాల్‌, తెలంగాణ కూడా ఇందులో భాగస్వాములయ్యేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా వరదలతో సంభవించిన నష్టాల కారణంగా వ్యాపార సంస్థల మఽధ్య జరిగే (బీ2బీ) లావాదేవీలపై ఒక శా తం సెస్సును విధించుకునే అధికారం తెలంగాణకు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జీఎస్‌టీ కౌన్సిల్‌ను కోరారు..


మరిన్ని నిర్ణయాలు..

విమాన ఇంధనం (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎ్‌ఫ)ను జీఎ్‌సటీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనపై రాష్ట్రాలు అంగీకరించలేదని మంత్రి వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు ఏటీఎ్‌ఫపైనా పన్ను విధింపు అధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండనుంది.

స్నాక్‌ పాప్‌కార్న్‌పై పన్ను విషయంలో మండలి వివరణ ఇచ్చింది. ఉప్పు, మసాలా దినుసులు కలిసిన పాప్‌కార్న్‌ను ప్రస్తుతం నమ్‌కీన్‌గా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ పాప్‌కార్న్‌ లూజు విక్రయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని.. ప్రీ-ప్యాకేజ్డ్‌, లేబుల్‌తో విక్రయిస్తే మాత్రం 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మండలి స్పష్టం చేసింది. చక్కెర కలిపిన (క్యారమెలైజ్డ్‌) పాప్‌కార్న్‌పైన 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రజా పంపిణీకి వినియోగించే ఫోర్టిఫైడ్‌ బియ్యం గింజలపై పన్ను 18ు నుంచి 5 శాతానికి తగ్గించాలని మండలి నిర్ణయించింది. జీన్‌ థెరపీకి జీఎ్‌సటీ మినహాయింపునిచ్చింది.

బ్యాంక్‌లు, ఆర్థిక సేవల సంస్థలు రుణగ్రహీతలపై విధించే పెనాల్టీ చార్జీలపై జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం లేదు.

50ు శాతం ఫ్లైయా్‌షతో కూడిన ఏసీసీ బ్లాక్స్‌పై 12ుజీఎస్‌టీ

రైతు నేరుగా సరఫరా చేసే మిరియాలు, ఎండు ద్రాక్షపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎగుమతుల పోటీ సామర్థ్యం పెంచేందుకు మర్చంట్‌ ఎక్స్‌పోర్టర్లకు సరఫరాపై పరిహార సుంకం 0.1 శాతానికి తగ్గింపు

నైపుణ్య శిక్షణ భాగస్వాములకు జీఎ్‌సటీ మినహాయింపు ప్రతిపాదనకు ఆమోదం. త్వరలోనే అధికారిక ప్రకటన జారీ

పేమెంట్‌ అగ్రిగేటర్లకు ఊరట కల్పించేందుకు, రూ.2,000 లోపు డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలపై జీఎ్‌సటీ మినహాయింపు

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ డెలివరీ చార్జీలపై పన్ను విధింపు నిర్ణయం వాయిదా

Updated Date - Dec 22 , 2024 | 02:11 AM