Nissan Magnite Facelift: రూ. 5.99 లక్షలకే నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్.. దీని స్పెషల్ ఏంటంటే
ABN, Publish Date - Oct 04 , 2024 | 05:41 PM
మీరు తక్కువ ధరల్లో ఓ కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే నేడు బడ్జెట్ ధరల్లో అదిరిపోయే ఫీచర్లతో ఓ కారును దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. దాని వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రముఖ సంస్థ నిస్సాన్ ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ SUV Magnite కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈరోజు (అక్టోబర్ 4న) భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే దీని ఫీచర్లు ఏంటి, ధర ఎంత, ఎప్పటి నుంచి బుకింగ్ సౌకర్యం ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశంలో నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభించడంతో అన్ని వేరియంట్ ధరలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ప్రకటించారు.
ఫీచర్లు
ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.0 లీటర్ టర్బో ఇంజన్ ఉంది. 99 హెచ్‌పీ పవర్, 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ 20 kmpl మైలేజీని ఇస్తుంది. CVT వేరియంట్ 17.4 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నిస్సాన్ ఇండియా తన మూడు కొత్త కార్లను వచ్చే 30 నెలల్లో భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉంటుంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రయాణీకుల భద్రత కోసం 40 కంటే ఎక్కువ ప్రామాణిక ఫీచర్లు అందించబడ్డాయి. దీంతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
డిజైన్
ఇది 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. దీంతో పాటు 19+ యుటిలిటీ స్టోరేజ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, 336-540 లీటర్ బూట్ స్పేస్ వంటి ఇతర ఫీచర్లను కల్గి ఉంది. దీని మొత్తం సిల్హౌట్ నల్లటి గ్రిల్‌తో కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. కొత్తగా డిజైన్ చేసిన బంపర్స్ ఇచ్చారు. కొత్తగా రూపొందించిన 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. నిస్సాన్ భారతదేశంలో మూడు కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తీసుకురాబోతోంది. ఇవన్నీ 2024, 2026 మధ్య ప్రారంభించబడతాయని ప్రకటించారు.
టచ్‌స్క్రీన్
క్యాబిన్ మునుపటి మాదిరిగానే లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇది నలుపు, నారింజ రంగు థీమ్‌లో వచ్చింది. ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, L ఆకారపు LED DRL ఇవ్వబడ్డాయి. LED టెయిల్ ల్యాంప్, బంపర్ డిజైన్ కూడా కొత్తగా ఉన్నాయి. ఇది కాకుండా కొత్త అల్లాయ్ వీల్స్ ప్రవేశపెట్టారు. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే డెలివరీలు రేపు అంటే అక్టోబర్ 5 నుంచి మొదలవుతాయి.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 04 , 2024 | 05:42 PM