LPG Gas: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర
ABN, Publish Date - Jun 01 , 2024 | 07:35 AM
లోక్‌సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్‌పీజీ వినియోగదారులకు(LPG users) మంచి ఊరట లభించింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను(LPG cylinders rates) ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గడం విశేషం.
లోక్‌సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్‌పీజీ వినియోగదారులకు(LPG users) మంచి ఊరట లభించింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను(LPG cylinders rates) ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గడం విశేషం.
ఈ నేపథ్యంలో నేడు (జూన్ 1న) చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 72 రూపాయలు తగ్గించాయి. కానీ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచాయి. దీని రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. IOCL వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేటు జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రధాన నగరాల్లో
ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi)లో వాణిజ్య సిలిండర్ ధర రూ.69.50 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో రూ.1676కే 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ లభించనుంది. ఇక హైదరాబాద్(hyderabad)లో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.19 తగ్గి రూ.1975.50కి చేరుకుంది. మరోవైపు కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.72 తగ్గి రూ.1787కే సిలిండర్ లభ్యం కానుంది. ముంబైలో సిలిండర్ రూ. 69.50 తగ్గింపుతో రూ.1629కి అందుబాటులో ఉంటుంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.1840.50కి చేరింది. చండీగఢ్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.1697కి అందుబాటులో ఉంది. పాట్నాలో దీని కొత్త ధర రూ. 1932గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రూ.2050కి లభ్యం కానుంది.
గత నెలల్లో
వాణిజ్య LPG సిలిండర్ రేటు వరుసగా మూడో నెల తగ్గించబడింది. మే 1న చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.19 తగ్గించాయి. మే నెలలో సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1745.50, కోల్‌కతాలో రూ.1859, ముంబైలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా ఉండేది. ఏప్రిల్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.30కి పైగా తగ్గింది. ఈ కోత తర్వాత ఢిల్లీలో దీని ధర రూ. 1764.50 అయింది. ఏప్రిల్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కోల్‌కతాలో రూ.1879, ముంబైలో రూ.1717.50, చెన్నైలో రూ.1930లకు చేరింది.
ఇది కూడా చదవండి:
BOI : బీఓఐ 666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 07:37 AM