ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhavish Aggarwal: కమెడియన్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గరం గరం.. నెటిజన్ల కామెంట్స్

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:11 PM

ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్.. హాస్యనటుడు కునాల్ కమ్రాపై సోషల్ మీడియాలో గరం గరం అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు మ్యాటర్ ఏంటి, ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Ola CEO Bhavish Aggarwal

ఓలా ఎలక్ట్రిక్(ola electric) సీఈఓ, యజమాని భవిష్ అగర్వాల్(Bhavish Aggarwal).. హాస్యనటుడు కునాల్ కమ్రా మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఎందుకంటే వీరిద్దరూ ఒకరిపై ఒకరూ ట్వీట్లు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగించారు. అసలు మ్యాటర్ ఏంటి, ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. అయితే భవిష్ అగర్వాల్ అక్టోబర్ 5న మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో ఓలా గిగాఫ్యాక్టరీ చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ హాస్యనటుడు కునాల్ కమ్రా ఓలా దుమ్ము పట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రశ్నలు లేవనెత్తారు.


మంత్రితోపాటు

అంతేకాదు కునాల్ కమ్రా తన ట్వీట్‌లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ “భారత కస్టమర్ల గొంతు వినడానికి ఎవరూ లేరా?” అని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు చాలా మందికి రోజువారీ సాధనంగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా విశ్వసించగలరని ఆయన రాసుకొచ్చారు. తన ట్వీట్‌లో వినియోగదారు ఫోరమ్ @jagograhakjagoని కూడా ట్యాగ్ చేశాడు. దీంతో పాటు ఎవరైనా తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు పనిచేయకపోతే ట్వీట్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట్ వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు.. లిస్ట్ కానున్న కంపెనీలివే


సీఈఓ రియాక్షన్

ఇక కునాల్ పోస్ట్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ మీరు OLA గురించి చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సహాయం చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పెయిడ్ ట్వీట్ కోసం నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తానని లేదా మీ ఫ్లాప్ కామెడీ కెరీర్ నుంచి మీరు ఇప్పటివరకు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని ఆరోపించారు. లేదంటే నిశ్శబ్దంగా కూర్చోవాలన్నారు. నిజమైన కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఓలా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోందని, ఈ బ్యాక్‌లాగ్ త్వరలో క్లియర్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.


మీ కేంద్రంలో ఉంటే ఎలా

భవిష్ అగర్వాల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పటికే నాలుగు మీలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ముందు మీరు కస్టమర్ సేవలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సరైన స్ఫూర్తితో అభిప్రాయాలను తీసుకోవాలని అంటున్నారు. మీరు ఈ రంగంలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటే మీ ఉత్పత్తిని మెరుగుపరచాలని సూచనలిస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి OLAని కొనుగోలు చేయడానికి 3 నుంచి 4 నెలల జీతం ఆదా చేసుకుంటాడు. అలాంటి క్రమంలో మొదటి వారంలో సమస్యలు ఎదుర్కొని ఆ తర్వాత రోజుల తరబడి మీ సేవా కేంద్రంలో ఆ వాహనం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:


PM Kisan Yojana: మీకు పీఎం కిసాన్ యోజన 18వ విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 06 , 2024 | 09:15 PM