ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitharaman: సహారా స్కీంల నుంచి రూ.138.07 కోట్లు మాత్రమే ఇచ్చాం..ఇన్వెస్టర్లు వచ్చి తీసుకోవాలి

ABN, Publish Date - Aug 05 , 2024 | 09:07 PM

సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణంతో సెబీ ఖాతాలో ఉన్న రూ.25 వేల కోట్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. సహారా రెండు పథకాల(sahara schemes) కింద మొత్తం రూ.25,000 కోట్లలో రూ.138.07 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం తెలిపారు.

Nirmala Sitharaman

సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణంతో సెబీ ఖాతాలో ఉన్న రూ.25 వేల కోట్ల గురించి మళ్లీ చర్చ మొదలైంది. సహారా రెండు పథకాల(sahara schemes) కింద మొత్తం రూ.25,000 కోట్లలో రూ.138.07 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం తెలిపారు. దిగువ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా సీతారామన్(Nirmala Sitharaman) ఇప్పటివరకు క్లెయిమ్‌ల సంఖ్య 19,650 జరిగిందని చెప్పారు. వాటిలో అర్హత ప్రమాణాల ఆధారంగా 17,256 క్లెయిమ్‌లను పరిగణించారని, దీని ఫలితంగా రూ. 138.07 కోట్లు అందాయన్నారు. ప్రజలకు చేరువయ్యేలా ప్రకటనల ద్వారా పదేపదే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లభించడం లేదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.


నమోదు చేసుకోవాలి

ఈ క్రమంలో సహారా గ్రూప్‌కు చెందిన కోఆపరేటివ్ సొసైటీల నిజమైన డిపాజిటర్ల ద్వారా క్లెయిమ్‌ల సమర్పణ కోసం సహారా రీఫండ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు గుర్తు చేశారు. వాపసు కోసం వచ్చే వారు రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలను కోరాలని ఆమె ఎంపీలకు సూచించారు. ఈ పోర్టల్‌కి వెళ్లి మీ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఒక కమిటీ రిటైర్డ్ జడ్జితో సహా ముగ్గురు వ్యక్తులు క్లెయిమ్‌లను పరిశీలించి, డబ్బు పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో గౌరవనీయులైన సభ్యులందరినీ అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థలో పెట్టుబడి చేసిన వారు వచ్చి చెల్లుబాటు అయ్యే కాగితాలను చూపించి, డబ్బు తీసుకెళ్లాలని సూచించారు. కానీ భారత ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే ఆలోచనను ఈ సందర్భంగా తొలగించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే చాలా వరకు అనేక మంది వివరాలు సరిగా లేకపోవడంతో దాదాపు 24 వేల కోట్లు సెబీ వద్దే ఉన్నాయి.


తిరిగి చెల్లిస్తాం

సుప్రీంకోర్టు పలు మార్లు ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితాలను దక్కడం లేదని సీతారామన్ పార్లమెంటుకు తెలియజేశారు. వాస్తవికతను ధృవీకరించిన తర్వాత కస్టమర్‌లకు డబ్బు తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలో సెబీ 2013, 2014, 2018లో ప్రకటనలు చేసింది. ఎవరైనా పెట్టుబడి దారులు ఉంటే వచ్చి క్లెయిమ్ చేసుకోవాలని కోరింది. SIRECL, SHICL సహారా రెండు కంపెనీలు జారీ చేసిన ఐచ్ఛిక పూర్తిగా కన్వర్టబుల్ డిబెంచర్స్ (OFCD)లో పెట్టుబడి పెట్టిన వారి వాస్తవికతను ధృవీకరించిన తర్వాత తిరిగి ఇవ్వాలని 2012లో సుప్రీం కోర్ట్ సెబీని ఆదేశించింది. ఇప్పటివరకు 3.07కోట్ల పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ.25,781.37 కోట్లు బకాయిలు ఉన్నాయని అంచనా వేశారు. సహారా కంపెనీలు తమ డబ్బును 15 శాతం వడ్డీతో ఆ పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 09:08 PM

Advertising
Advertising
<