Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. రూ.26 వేల కోట్లు ఖతం..కారణమిదేనా?
ABN, Publish Date - Feb 14 , 2024 | 02:36 PM
పేటీఎం షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా ఈ సంస్థ షేర్ ప్రైస్ నేడు(బుధవారం) ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆంక్షల తర్వాత Paytm షేర్ ప్రైస్ రోజురోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంస్థ షేర్ ప్రైస్ మళ్లీ ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. ఈ రోజు(బుధవారం) ట్రేడింగ్ సమయంలో దాదాపు 10% పడిపోయింది. ఈ క్రమంలో BSEలో రూ. 342.15కి చేరుకుంది. ఈ నేపథ్యంలో గత 10 రోజుల ట్రేడింగ్ సెషన్లలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు దాదాపు రూ.26,000 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలోనే Paytm మార్కెట్ క్యాప్ విలువ రూ.25,854 కోట్లు తగ్గింది.
Paytm సంస్థ ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ తెలిపింది. ఈ క్రమంలో వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్, వ్యాలెట్, ఫాస్ట్‌ట్యాగ్ సహా తదితర క్రెడిట్ లావాదేవీలు చేయోద్దని సూచించింది. అయితే వీటిని సడలించే విషయంలో మాత్రం ఎలాంటి సమీక్షలు జరపడం లేదని వెల్లడించింది.
ఈ అంశంపై కొంతమంది రుణం ఇచ్చే భాగస్వాములతో తమ ఛానెల్ సంబంధాన్ని పునరాలోచిస్తున్నట్లు సూచిస్తున్నాయని Paytm తెలిపింది. లెండింగ్ పార్టనర్‌లు ఇప్పటికే BNPL ఎక్స్‌పోజర్‌ని Paytmకి మరింత తగ్గించారు. ఈ క్రమంలో ప్రస్తుత గరిష్ట స్థాయి రూ.2,000 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.
Paytm టార్గెట్ ధరను సూచించిన మొదటి సంస్థ Macquarie. ఈ కంపెనీ పేటీఎం లిస్టింగ్ కంటే ముందే స్టాక్ ధరను రూ.1,200గా ప్రకటించింది. గత సంవత్సరం Macquarie Paytm టార్గెట్ ధరను రూ.800గా తెలిపింది. 2022లో Paytm టార్గెట్ ధర 'అండర్ పెర్ఫార్మ్' రేటింగ్‌తో రూ450గా సూచించగా.. ఇప్పుడు ఆ లక్ష్యం రూ.275కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Feb 14 , 2024 | 02:36 PM