Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
ABN, Publish Date - Oct 14 , 2024 | 05:38 PM
దీపావళికి ముందు భారతదేశంలో ఫేన్ పే సంస్థ సరికొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. అదే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని ద్వారా దీపావళి సమయంలో టపాసుల ద్వారా గాయాలైతే తీసుకున్న కస్టమర్లకు బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే అందుకోసం ఎంత చెల్లించాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రముఖ చెల్లింపుల సంస్థ PhonePe నేడు (అక్టోబర్ 14న) కీలక ప్రకటన చేసింది. ఇకపై తన ప్లాట్‌ఫాంలో టాపాసుల సంబంధిత ప్రమాదాల నుంచి సమగ్ర రక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం పేరు ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు భద్రతతోపాటు టెంన్షన్ లేకుండా పండుగను జరుపుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ బీమా ప్లాన్ కేవలం రూ. 9కే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 10 రోజులపాటు రూ.25,000 వరకు కవరేజీని అందించనున్నట్లు స్పష్టం చేశారు.
నిమిషంలోనే
అంతేకాదు ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో చేరడం, ప్రమాదవశాత్తు మరణ ఖర్చుల నుంచి ఆర్థికంగా రక్షించుకోవడం కోసం ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ బీమా పాలసీ కవరేజీ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుందని, ఫోన్‌పే యాప్‌లో నిమిషంలోపు దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ చెప్పింది. ఈ పాలసీని వినియోగదారులు వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు కుటుంబ సభ్యులకు కూడా బీమా చేసుకోవచ్చని ప్రకటించింది.
ఆర్థిక సమస్యల నుంచి
అక్టోబరు 25 తర్వాత వినియోగదారు బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే పాలసీ కవర్ కొనుగోలు తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పండుగ సీజన్‌లో ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా తెలిపారు. ఈ కవరేజ్ కుటుంబాలకు అవసరమైన రక్షణను అందిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు ప్రమాదాల నుంచి రక్షించబడతారని నిర్ధారిస్తుందన్నారు. అలాంటి సమయంలో ఊహించని ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చన్నారు.
ఎలా అప్లై చేయాలంటే
ఫోన్ యాప్‌లోని బీమా విభాగానికి వెళ్లి, హోమ్‌పేజీ నుంచి ఫైర్‌క్రాకర్ బీమాను ఎంచుకోండి
ఇప్పుడు మీరు ఈ పథకం వివరాలను చూడవచ్చు. ఇందులో రూ. 25,000 హామీ మొత్తం, రూ. 9 స్థిర ప్రీమియం, ప్లాన్ ప్రయోజనాలు ఉంటాయి
మీరు బీమా సంస్థ సమాచారాన్ని వీక్షించవచ్చు. ప్లాన్ ప్రయోజనాల వివరణాత్మక వివరాలను కూడా పొందవచ్చు
చివరగా మీరు అప్లై చేయాలనుకుంటే పాలసీదారు వివరాలను పూర్తి చేయండి
ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు 'ప్రొసీడ్ టు పేమెంట్' ఆప్షన్ క్లిక్ చేసి తీసుకోవచ్చు
ఇవి కూడా చదవండి:
BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 14 , 2024 | 05:45 PM