ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM E DRIVE: ఈవీలు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి రూ. 50 వేల వరకు తగ్గింపు

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:59 PM

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరిపోయే న్యూస్ వచ్చింది. అక్టోబర్ 1, 2024 నుంచి PM E DRIVE యోజన స్కీం అమల్లోకి రానుంది. దీంతో ఆయా వాహనాలు కొనుగోలు చేసేవారికి 50 వేల వరకు తగ్గింపు లభించనుంది.

PM E DRIVE scheme update

వచ్చే నెల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(electric vehicles) కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే అక్టోబర్ 1, 2024 నుంచి PM E-DRIVE యోజన స్కీం అమల్లోకి రానుంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం PM E డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో ఎలక్ట్రిక్ ట్రక్కులు, టెంపో, ద్విచక్ర వాహనాల కొనుగోలుపై ఫేమ్ 1, ఫేమ్ 2 వంటి సబ్సిడీలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 88,500 ప్రదేశాలలో కొత్త ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.


50 వేల వరకు సబ్సిడీ

ఈ క్రమంలో 2024-25లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ. 5,000, త్రీవీలర్‌లకు ఒక్కో వాహనానికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇదే సబ్సిడీ 2025-26లో టూ వీలర్లకు అయితే రూ. 2500, మూడు చక్రాల వాహనాలకు రూ. 25000 వరకు అందిస్తారు. సెప్టెంబరు 11న కేంద్ర మంత్రివర్గం PM E-డ్రైవ్ స్కీమ్ కోసం రూ. 10,900 కోట్ల మొత్తాన్ని ఆమోదించింది.

ఈ సబ్సిడీ పథకంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే చేర్చబడ్డాయి. అయితే హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు మాత్రం వీటిలో లేవు. ఈ పథకం కింద 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఇ త్రీ వీలర్లు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు లభించనుంది.


సబ్సిడీ పొందాలంటే

ఈ పథకం కింద స్థానికంగా పరికరాలను పొందే EV తయారీదారులు ఆర్థిక సహాయం పొందుతారు. సబ్సిడీ పొందడానికి EV పరికరాల భాగాలను స్థానికంగా అసెంబుల్ చేయాలి. అయితే సరఫరాదారులు విడిభాగాలను దిగుమతి చేసుకోవచ్చు. స్థానిక EV తయారీని PMP కింద ప్రోత్సహిస్తామని సీనియర్ అధికారులు తెలిపారు. దీని కింద సబ్సిడీ పొందడానికి, కంపెనీలు పథకం నోటిఫికేషన్ జారీ చేసిన ఆరు నెలల్లోపు PMP నిబంధనలను పాటించాలి. సబ్సిడీ పొందుతున్న కంపెనీలు ఈవీ పరికరాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నాయని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.


కాలుష్యం

ప్రస్తుతం వాయు కాలుష్యంలో ఎక్కువ భాగం వాహనాల వల్లే జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోంది. కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాల నుంచి తగ్గించడమే ఈ స్కీం ప్రధాన లక్ష్యం. దీంతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించడానికి ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం కొత్త దశను కూడా క్యాబినెట్ ప్రకటించింది. ఇందులో 62,500 కి.మీ పొడవున కొత్త రోడ్లు నిర్మించనున్నారు. ఈ పథకానికి దాదాపు 70 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యానికి అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు


Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 30 , 2024 | 05:01 PM