ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Saving Plan: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..ఇలా చేస్తే నెలకు రూ. 9,250 ఆదాయం

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:49 PM

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు(employees) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒకటో తేదీన జీతాలు(salaries) రావడంతో 15వ తేదీ వచ్చే నాటికి అనేక మందికి అయిపోతుంటాయి. అయితే ఇలా చేసే బదులు మీరు ప్రతి నెల కొంత అదనపు ఆదాయాన్ని పొందడం ద్వారా ఆర్థిక సమస్యల(financial problems) నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Post Office monthly investment Scheme

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు(employees) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒకటో తేదీన జీతాలు(salaries) రావడంతో 15వ తేదీ వచ్చే నాటికి అనేక మందికి అయిపోతుంటాయి. పాలు, పవర్ బిల్, కిరణా ఖర్చులు, కూరగాయల బిల్, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఈఎంఐ సహా ఇతర ఖర్చులు తేల్చే సమయంలో జేబులు ఖాళీ అవుతున్నాయి. దీంతో మళ్లీ మనీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇలా చేసే బదులు మీరు ప్రతి నెల కొంత అదనపు ఆదాయాన్ని పొందడం ద్వారా ఆర్థిక సమస్యల(financial problems) నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.


పోస్టాఫీసు(Post Office)లో అనేక పొదుపు పథకాలు ఉన్నప్పటికీ నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడిదారుడికి ప్రతి నెలా ఆదాయాన్ని అందించే బెస్ట్ స్కీం(Post Office monthly investment Scheme) అని చెప్పవచ్చు. ఈ స్కీంలో ఒకసారి పెట్టుపడి(investment) పెడితే ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో మీరు ఒంటరిగా లేదా మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. అయితే మీరు ఈ స్కీంలో ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని వడ్డీ రూపంలో ఆదాయంగా తీసుకోవచ్చు.


ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒంటరిగా ఖాతా తెరిస్తే గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కనీసం 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు డిపాజిట్(investment) చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ నుంచి మీరు ప్రతి నెలా ఆదాయాన్ని పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ ఖాతాను తెరిచి రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 9,250 వరకు అదనపు ఆదాయాన్ని స్వీకరించవచ్చు. రూ.9 లక్షల డిపాజిట్‌పై ప్రతి నెలా రూ.5500 వడ్డీ లభిస్తుంది.


ప్రస్తుతం పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో 7.4 శాతం వడ్డీ(intrest) లభిస్తోంది. ఏ పౌరుడైనా ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. మీరు పిల్లల పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు చేరవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాను తెరవడానికి, మీరు మీ ఇంటి చిరునామా, ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను సమీప పోస్టాఫీసులో సమర్పించాలి.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 03:54 PM

Advertising
Advertising