ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

ABN, Publish Date - Jul 26 , 2024 | 12:58 PM

ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

post office national Savings Certificate Scheme

ప్రస్తుత కాలంలో ఎవరైనా కూడా తక్కువ కాలంలో పెట్టుబడులు(investments) పెట్టి లక్షాధికారులు కావాలని భావిస్తుంటారు. అందుకోసం పోస్టాఫీస్ గ్యారంటీ పథకం(post office scheme) ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) స్కీం. దీని ద్వారా కనీసం వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తంలోనైనా పొదుపు చేయవచ్చు. ఈ స్కీంలో మీరు పొదుపు చేయడం ద్వారా చేసిన పెట్టిన మొత్తంపై ప్రస్తుతం FDల కంటే ఎక్కువగా 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో డిపాజిట్ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పెట్టిన డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తారు. బ్యాంకులకు పోటీగా ఈ స్కీంలో అనేక మంది పెట్టుబడులు చేస్తున్నారు.


ఖాతా బదిలీ

ఈ స్కీంలో పెట్టుబడి చేయడం ద్వారా ఆదాయ చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ మొత్తంపై రూ.1,50,000 మినహాయింపు కూడా ఇవ్వబడుతుంది. అంతేకాదు ప్రైవేటు పెట్టుబడులతో పోలిస్తే వీటిలో అసలు రిస్క్ ఉండదని చెప్పవచ్చు. దీంతోపాటు మీకు గ్యారంటీగా వడ్డీతోపాటు మొత్తం చెల్లిస్తారు. ఈ పథకం కింద పెట్టుబడిదారులు తమ ఖాతాలను వేరొకరి పేరుకు కూడా బదిలీ చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కింద ఒక వ్యక్తి ఒంటరిగా ఖాతాను తెరవవచ్చు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా సంరక్షకులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి కోసం కూడా ఖాతాలను తీసుకోవచ్చు.


అత్యధిక వడ్డీ

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్(national savings certificate scheme) వార్షిక వడ్డీని 7.7 శాతం అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ వడ్డీపై సమ్మేళనం వడ్డీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది పెట్టుబడి వ్యవధి పూర్తయిన తర్వాత ఇవ్వబడుతుంది. అయితే ఈ స్కీం ద్వారా ఎలా లక్షాధికారులు కావచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొదుపు పథకంలో మీరు రోజుకు రూ.500 చొప్పున ఐదేళ్లలో రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే డిపాజిట్ మెచ్యూర్ అయ్యేసరికి మీరు రూ.13,04,130 పొందుతారు. ఇందులో మీరు పెట్టిన మొత్తం రూ. 9,00,000 కాగా, మీకు అదనంగా రూ. 4,04,130 రిటర్న్‌ వడ్డీ లభిస్తుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సురక్షిత రుణాలకు ఎన్‌ఎస్‌సీని కొలేటరల్ లేదా సెక్యూరిటీగా కూడా అంగీకరిస్తాయి.


ఇవి కూడా చదవండి:

Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!


Gold and Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోళ్ల కోసం క్యూ కడుతున్న జనాలు


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 26 , 2024 | 01:01 PM

Advertising
Advertising
<