ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Post Office Scheme: ఈ 5 పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం పొందొచ్చు..!

ABN, Publish Date - Mar 26 , 2024 | 02:40 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్స్(Investments) వైపు దృష్టి సారిస్తున్నారు. ఉన్న కొంత మొత్తమైనా పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి పొందాలని భావిస్తుంటారు. తక్కువ పెట్టుబడిపై మంచి వడ్డీని అందించే పథకాల(Investment Schemes) కోసం వెతుకుతుంటారు. అలాంటి పెట్టుబడి స్కీమ్స్‌ని మీకోసం తీసుకువచ్చాం. పోస్ట్ ఆఫీస్‌కు(Post Office) చెందిన ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా..

Post Office Schemes

Post Office Schemes: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్స్(Investments) వైపు దృష్టి సారిస్తున్నారు. ఉన్న కొంత మొత్తమైనా పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడి పొందాలని భావిస్తుంటారు. తక్కువ పెట్టుబడిపై మంచి వడ్డీని అందించే పథకాల(Investment Schemes) కోసం వెతుకుతుంటారు. అలాంటి పెట్టుబడి స్కీమ్స్‌ని మీకోసం తీసుకువచ్చాం. పోస్ట్ ఆఫీస్‌కు(Post Office) చెందిన ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఇందులో డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు.. మంచి రాబడిని కూడా పొందుతారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కొన్ని పథకాల్లో రూ. 100 లతో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

కేవలం 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించాలనుకుంటే.. పోస్టాఫీసులో RD చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)లో పెట్టుబడిని కేవలం 100తో ప్రారంభించవచ్చు.

Post Office RD పై మంచి వడ్డీ పొందొచ్చు..

ప్రస్తుతం ప్రభుత్వం పోస్టాఫీసు ఆర్డీపై 6.7 శాతం వడ్డీ ఇస్తోంది. ఇది ఒక రకమైన సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసు RDలో కనీసం రూ. 100 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్లాన్‌ని కనీసం 5 సంవత్సరాలు కొనసాగించాలి.

ఈ పథకాలతో కూడా భారీగా రాబడిని పొందవచ్చు..

పోస్ట్ ఆఫీస్ RDతో పాటు మరికొన్ని పథకాల్లో కూడా పెట్టుబడిని పెట్టవచ్చు. వీటి ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అదే సమయంలో మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా సురక్షితంగా ఉంటాయి.

Post Office MIS Scheme: పోస్ట్ ఆఫీసులో జాతీయ నెలవారీ ఆదాయ పథకంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో పెట్టుబడి కనీసం రూ. 1000 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

National Saving Certificate Scheme: ఈ పథకంలోనూ నెలకు రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 7 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో ఈ డబ్బు పొందుతారు.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన కూడా పోస్టాఫీసు పెట్టుబడి పథకాల్లో మంచి పొదుపు పథకం. ఇందులో నెలవారీగా పెట్టుబడి పెడితే.. 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.

Kisan Vikas Patra: ప్రజలు కిసాన్ వికాస్ పత్ర పథకంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 7.2 శాతం వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 02:40 PM

Advertising
Advertising