RBI: పేటీఎం బ్యాంకుకు మరో ఛాన్స్ ఇచ్చిన ఆర్‌బీఐ
ABN, Publish Date - Feb 16 , 2024 | 06:13 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు. జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన కఠినమైన ఆంక్షల గురించి ప్రజల ప్రశ్నల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కస్టమర్‌లు మార్చి వరకు డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు చేయవచ్చని RBI తెలిపింది.
ఈ క్రమంలోనే Paytm QR, సౌండ్‌బాక్స్, EDC (కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తాయని పేటిఎం ఎండీ విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం Xలో పేర్కొన్నారు. వీటి విషయంలో ఎలాంటి పుకార్లను ప్రచారం చేయోద్దని ఆయన కోరారు.
మార్చి 15, 2024 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటిలో తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబడవు. అయితే వడ్డీలు కాకుండా, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్ చేయడం లేదా ఎప్పుడైనా క్రెడిట్ చేయబడే రీఫండ్‌లు ఉంటాయని ప్రకటనలో వెల్లడించింది.
Updated Date - Feb 16 , 2024 | 07:18 PM