ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shaktikanta Das: రేపో రేటు యథాతథం..

ABN, Publish Date - Aug 08 , 2024 | 12:11 PM

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.

ఢిల్లీ: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కూడా రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఆర్‌బీఐ బెంచ్‌మార్క్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడం ఇది 9వ సారి కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం, వృద్ధి అనేవి రెండూ కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ ఆహార ధరల విషయమంలో అప్రమత్తత అవసరమని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.


కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీసీ తొలిసారిగా సమావేశమైంది. మొత్తంగా చూస్తే ఇది 50వ సమావేశం. ఈ సమావేశంలో మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురిలో నలుగురు పాలసీ రేటును యథాతథంగా ఉంచాలనే నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారని శక్తికాంత దాస్ చెప్పారు. ముఖ్యంగా.. సెంట్రల్ బ్యాంక్ నుంచి బ్యాంకులు డబ్బు తీసుకునే రేటు. రెపో రేటు స్థిరంగా ఉండటంతో మన రుణ వాయిదాలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవు. రెపో రేటు తగ్గితే మన హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వాయిదా తగ్గుతుంది. ఆర్‌బీఐ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో రెపో రేటును మార్చింది. ఆ తర్వాత 0.25 శాతం పెరిగి 6.50 శాతానికి చేరుకుంది.


ఎంపీసీ కీలక నిర్ణయాలు..

ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఏప్రిల్‌ - మే వరకూ స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం.. జూన్‌లో మళ్లీ పెరిగింది.

భారత సేవా రంగ కార్యకలాపాలన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి.

2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం కాగా.. ఒకటి, రెండు, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో క్వార్టర్‌లో 7.3 శాతంగా ఉండే అవకాశం.

ఆహార ద్రవ్యోల్బణం అనేది నైరుతి రుతుపవనాల కారణంగా దిగొచ్చే అవకాశం ఉంది.

2024-25లో ద్రవ్యోల్బణం 4.5 శాతం.. రెండో త్రైమాసికంలో 4.4%.. మూడో త్రైమాసికంలో 4.7%.. నాలుగో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండవచ్చు.

భారత కరెన్సీ రూపాయి మారకం విలువ విషయానికి వస్తే.. పరిమిత శ్రేణిలోనే ఉంది.

భారత విదేశీ మారక నిల్వలు ఆగస్టు రెండు నాటికి రికార్డ్ స్థాయిలో 675 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు.

రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఒకవైపు పెరుగుతుంటే.. బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు క్రెడిట్‌ డిమాండ్‌ను అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయి.

వ్యక్తిగత రుణ వితరణలో గణనీయ వృద్ధిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

టాపప్‌ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో ఆర్థిక సంస్థలు పెద్దగా నిబంధనలను పాటించడం లేదు. ఇలాంటి వాటిని అరి కట్టాలి.

యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు.

Updated Date - Aug 08 , 2024 | 12:11 PM

Advertising
Advertising
<