Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
ABN, Publish Date - Oct 19 , 2024 | 02:57 PM
మీరు రిటైర్‍మెంట్ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్నారా. అయితే మీరు ఇప్పటి నుంచే ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. అయితే ఈ స్కీంలో ప్రతి రోజు ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు మీ వృద్ధాప్య సమయంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఈ క్రమంలో రోజూ మీరు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ వెళితే మీరు ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి రిటైర్‍మెంట్ అయిన తర్వాత మీకు అవి మీకు ఉపయోగపడతాయి. అందుకోసం అటల్ పెన్షన్ యోజన(atal pension yojana) స్కీం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మీరు కనీసంగా 10 రూపాయల నుంచి కూడా ఆదా చేసుకోవచ్చు. మీ వృద్ధాప్యాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ప్రభుత్వ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజు రూ. 20
ప్రస్తుతం మీ వయస్సు 30 ఏళ్లు ఉందనుకుంటే.. దీనిలో మీరు ప్రతిరోజూ రూ. 20 పొదుపు చేయడం ద్వారా మీకు 60 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి నెలా రూ. 5000 పెన్షన్ లభిస్తుంది. ఈ క్రమంలో మీరు నెలకు రూ. 577 చెల్లించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు మొత్తం 30 ఏళ్లలో చెల్లించాల్సిన మొత్తం రూ. 2,07,720 అవుతుంది. కానీ ఆ తర్వాత మీకు ప్రతి నెలా కూడా రూ. 5 వేల పెన్షన్ వస్తుంది. మరణానంతరం నామినీకి డబ్బు అందజేస్తారు. ఈ స్కీంలో 18 సంవత్సరాల నుంచే సేవ్ చేసుకోవచ్చు. వయస్సు పెరిగే కొద్ది పొదుపు చేసే మొత్తం కూడా పెరుగుతుంది.
రోజు రూ. 12
ఒక వేళ మీరు 25 ఏళ్ల వయస్సు నుంచే పొదుపు చేయడం ప్రారంభిస్తే దీనిలో రోజుకు రూ. 12 సేవ్ చేస్తే సరిపోతుంది. ఆ క్రమంలో నెలకు రూ. 376 ఆదా చేయగా, 35 ఏళ్ల మొత్తానికి మీరు కేవలం రూ. 1,57,920 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ. 5 వేల పెన్షన్ లభిస్తుంది. తక్కువ వయస్సులో ఉన్నప్పుడు సేవ్ చేస్తే రోజుకు పొదుపు చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సేవ్ చేసే మొత్తం రెండు లక్షలు కాగా, 25 ఏళ్ల వయస్సులో అది కేవలం రూ. 1,57,920గా ఉండటం విశేషం.
ఎలా చేయాలంటే..
మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి అటల్ పెన్షన్ యోజన స్కీం ఖాతాను తీసుకోవచ్చు. దీని కోసం మీరు అక్కడ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి. ఆ క్రమంలో మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్‌ను అందించాలి. దీనిలో మీరు మీ పొదుపు ప్రకారం ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాను భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకోవచ్చు. పదవీ విరమణ సమయంలో ఇద్దరికీ ఖాతాలు ఉంటే, ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ పొందగలుగుతారు. ఒక వేళ ఏదైనా జరిగి ఇద్దరూ కూడా మరణిస్తే మరణానంతరం నామినీకి డబ్బు అందజేస్తారు.
ఇవి కూడా చదవండి:
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 19 , 2024 | 02:58 PM