ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Luxury Car Deal: రూ. 50 లక్షల విలువైన కారు కేవలం రూ. 7.5 లక్షలకే.. ఎలాగంటే..

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:24 PM

మీరు మంచి ఖరీదైన కారును తక్కువ ధరకు పొందాలని అనుకుంటే మీకు గుడ్ న్యూస్. ఇటివల BMW బ్రాండ్ దాదాపు రూ. 50 లక్షల విలువైన కారును కేవలం రూ. 7.5 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. అయితే అది ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Mini Cooper S offer price

మీరు తక్కువ డబ్బుతో మంచి లగ్జరీ కారును(car) తీసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ మీరు BMW బ్రాండ్ కారును చౌకగా పొందవచ్చు. అంది కూడా కేవలం రూ.7.5 లక్షలకే ఈ కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే దీని కోసం మీరు BMW యాజమాన్యంలోని మినీ బ్రాండ్ కూపర్ కార్ ఆఫర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. దాదాపు రూ. 50 లక్షల ఆన్‌రోడ్‌ ఖరీదు చేసే కారును కేవలం రూ.7.5 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇది కారు బుకింగ్ మొత్తం కాదు. కానీ మినీ కూపర్ Sని ఇంటికి తీసుకురావడానికి మీరు ఎటువంటి డౌన్ పేమెంట్ (జీరో డౌన్ పేమెంట్) చేయనవసరం లేదు.


తక్కువ ధరకు లగ్జరీ కార్

ఈ చిన్నదైన పూర్తి లగ్జరీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 44.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో కంపెనీ మినీ కూపర్ ఎస్‌పై గొప్ప ఫైనాన్స్ ప్లాన్‌ను అందించింది. ఇందులో ఏడాదికి రూ.7.5 లక్షలు చెల్లించి మీరు ఈ మినీ కూపర్ ఎస్‌ను సొంతం చేసుకునే అవకాశం అందిస్తోంది. మీరు కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లో టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేయడం ద్వారా దాని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫైనాన్స్ ప్రోగ్రామ్ సుమారు 7 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ కంపెనీ ఆఫర్ నవంబర్ 30, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో మీరు కారు కోసం ఎలాంటి డౌన్‌పేమెంట్ చేయనవసరం లేదు.


ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

అయితే ఈ కారులో ఉన్న ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో మీరు 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు ఎంపికలను పొందుతారు. 4 సీట్ల మోడల్‌లో కూడా మీకు 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ కారు ఇంజన్ 204 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది పికప్ కేవలం 6.6 సెకన్లలో 100 కి.మీల వేగాన్ని అందుకోగలదు. దీనిలో మీరు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ నుంచి వెంటిలేటెడ్ సీట్లు, లగ్జరీ అప్హోల్స్టరీ వరకు ప్రతిదీ పొందుతారు.


దీంతోపాటు ఆరు

మినీ కూపర్ Sలో 9.4-అంగుళాల OLED టచ్‌స్క్రీన్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటుపై మసాజ్ ఫంక్షన్, యాంబియంట్ లైటింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. భద్రత పరంగా దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కొన్ని అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు (ADAS), డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌ వంటివి కూడా అందుబాటులో కలవు.


ఇవి కూడా చదవండి:

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. కారణమిదే..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 12:53 PM