ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rupee Vs Dollar: అసలేమైంది.. జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ

ABN, Publish Date - Nov 08 , 2024 | 01:58 PM

అమెరికా డాలర్‌ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Rupee Vs Dollar

ముంబై: అమెరికా డాలర్‌ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇవాళ (శుక్రవారం) ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 5 పైసలు మేర క్షీణించింది. దీంతో జీవితకాల కనిష్ఠ స్థాయి 84.37కి పతనమైంది. ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి ఈ రోజు లాభంతో 84.32 వద్ద ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత 5 పైసలు పడిపోయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కాగా గత ట్రేడింగ్ సెషన్ గురువారం అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి 1 పైసా మేర క్షీణించిన విషయం తెలిసిందే.


వడ్డీరేట్లను తగ్గిస్తూ ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులు మారాయని ఫారెక్స్ ట్రెడర్స్ చెబుతున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో పన్నులు, వాణిజ్య విధానాలు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయేమోననే ఆందోళనలు నెలకొన్నాయని, అందుకే రూపాయి ఒడిదొడుకులకు లోనవుతోందని, తిరిగి పతన బాట పట్టిందని నిపుణులు చెబుతున్నారు.


యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల ద్రవ్య విధాన ప్రకటనలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 4.5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై మార్కెట్ దృష్టి ఉంటుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబరి అన్నారు. ద్రవ్యోల్బణం, ఉపాధిలో సమతుల్య నష్టాలను గుర్తించి యూఎస్ ఫెడ్ తటస్థ నుంచి వడ్డీ రేటును తగ్గించిందని, ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలన్నారు.


ఇవి కూడా చదవండి

MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే ఇదీ.. ఆశ్చర్యపోయిన బెంగళూరు దంపతులు..

అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్

అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా

గర్ల్‌ఫ్రెండ్ కొత్త హెయిర్‌ స్టెయిల్ నచ్చలేదని.. నమ్మలేని పని చేశాడు

For More TS News and Telugu News

Updated Date - Nov 08 , 2024 | 02:05 PM