Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:06 PM
మీరు తక్కువ పెట్టుబడి(investment) పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలు రావాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అందుకోసం LIC జీవన్ ప్రగతి ప్లాన్(lic jeevan pragati plan) బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో 12 ఏళ్లలోపు పిల్లల నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తులు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తక్కువ పెట్టుబడి(investment) పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలు రావాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అందుకోసం LIC జీవన్ ప్రగతి ప్లాన్(lic jeevan pragati plan) బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో 12 ఏళ్లలోపు పిల్లల నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తుల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రతిరోజూ రూ.200 పెట్టుబడి(savings) పెట్టడం ద్వారా మీరు మెచ్యూరిటీపై దాదాపు రూ. 28 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. దీంతోపాటు మీరు జీవిత బీమా కవరేజీ సౌకర్యం కూడా పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ సమయం ఎంత, నిధులు ఎలా వస్తాయి, రిస్క్ కవర్ ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లాన్ మెచ్యూరిటీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న జీవన్ ప్రగతి ప్లాన్‌లో పెట్టుబడి(savings) పెట్టడం ద్వారా పాలసీ హోల్డర్ మంచి రాబడిని పొందుతారు. ఈ పథకంలో ప్రతి రోజు రూ.200 చొప్పున నెలకు రూ. 6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సంవత్సరానికి రూ.72,000 పెట్టుబడి అవుతుంది. ఆ విధంగా ఈ ప్లాన్‌ను 20 సంవత్సరాల వరకు కొనుగోలు చేస్తే, మీరు దాదాపు రూ. 14 లక్షల 40,000 పెట్టుబడి పెట్టనున్నారు. ఆ తర్వాత ప్లాన్ ద్వారా అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలతో కలిపి మీరు రూ. 28 లక్షల మొత్తాన్ని పొందుతారు.
ఈ ప్లాన్ మెచ్యూరిటీ గరిష్టంగా 20 సంవత్సరాలు. మీరు ఈ పాలసీని కనీసం 12 సంవత్సరాల నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. 12 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన దీని ప్రీమియాన్ని చెల్లించుకోవచ్చు.
ప్రతి 5 సంవత్సరాలకు
LIC జీవన్ ప్రగతి ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ఈ డెత్ బెనిఫిట్(death benefit) పాలసీదారు మరణించిన తర్వాత, సాధారణ రివర్షనరీ బోనస్, ఫైనల్ బోనస్‌తో సహా బీమా మొత్తం పాలసీదారు నామినీకి ఇవ్వబడుతుంది. ఉదాహరణకు మీరు ఈ పాలసీని రూ.2,00,000కి కొనుగోలు చేశారనుకోండి, అప్పుడు మొదటి 5 సంవత్సరాలలో మరణ ప్రయోజనం సాధారణంగా ఉంటుంది.
ఆ తర్వాత 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కవరేజీ రూ. 2.5 లక్షలు అవుతుంది. 10 నుంచి 15 సంవత్సరాలలో కవరేజీ 3లక్షలకు పెరుగుతుంది. ఈ విధంగా పాలసీదారుడి కవరేజీ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ఈ జీవన్ ప్రగతి ప్లాన్‌ని కొనుగోలు చేయడానికి మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కూడా తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ
Ola Electric: మై మ్యాప్ ఇండియా డేటా చోరీ ఆరోపణలను ఖండించిన ఓలా ఎలక్ట్రిక్
Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..
Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 31 , 2024 | 05:07 PM