ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mcap Increase: వారంలో లక్ష కోట్లు పెరిగిన సంపద.. ఎక్కువగా లాభపడ్డ కంపెనీలివే..

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:47 AM

గత వారం పలు కంపెనీల స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. దీంతో టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఆరింటి మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది. వీటిలో ప్రధానంగా లాభపడిన కంపెనీల వివరాలను ఇక్కడ చుద్దాం.

Mcap Increase

దేశంలో టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లో ఆరింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) గత వారం స్టాక్ మార్కెట్లో(stock market) ఏకంగా రూ.1,07,366.05 కోట్లు పెరిగింది. ఈ క్రమంలో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంకులు అత్యధికంగా లాభపడ్డాయి. కొత్త సంవత్సరం 2081 ప్రారంభానికి గుర్తుగా నవంబర్ 1న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ‘ముహూరత్ ట్రేడింగ్’ నిర్వహించబడింది. ఈ నేపథ్యంలో గత వారం 30 షేర్ల BSE సెన్సెక్స్ 321.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభపడింది. ఒక గంట ప్రత్యేక 'ముహూరత్ ట్రేడింగ్' సెషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.


ఈ కంపెనీల్లో మెరుగైన పనితీరు

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారంలో భారీగా పెరిగింది. కానీ ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ సంస్థల ఆదాయాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.


పెరిగిన ఆదాయం

గత వారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్ రూ. 36,100.09 కోట్లు పెరిగి రూ.7,32,755.93 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,775.58 కోట్లు పెరిగి రూ.9,10,686.85 కోట్లకు చేరుకుంది. ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ రూ.16,887.74 కోట్లు పెరిగి రూ.5,88,509.41 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15,393.45 కోట్లు పెరిగి రూ.18,12,120.05 కోట్లకు చేరాయి. ఇక ఐటీసీ వారంలో రూ.10,671.63 కోట్లు పెరుగగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,13,662.96 కోట్లకు చేరుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్ వాల్యుయేషన్ రూ.2,537.56 కోట్లు పెరిగి రూ.5,96,408.50 కోట్లకు చేరుకుంది.


ఈ కంపెనీలకు తగ్గిన ఆదాయం

ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,054.43 కోట్లు తగ్గి రూ.7,31,442.18 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ వాల్యుయేషన్ రూ.27,299.54 కోట్లు తగ్గి రూ.9,20,299.35 కోట్లకు స్థాయికి చేరింది. టీసీఎస్ వాల్యుయేషన్ రూ.26,231.13 కోట్లు తగ్గి, రూ.14,41,952.60 కోట్ల వద్ద ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,662.78 కోట్లు తగ్గి, రూ.13,26,076.65 కోట్ల స్థాయిలో ఉంది.


ఏ నంబర్‌లో ఎవరున్నారు?

ఇక టాప్ 10 కంపెనీల జాబితా విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌ఐసీ ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: వచ్చే వారం రానున్న స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు


UPI Services: నవంబర్‌లో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. కారణమిదే..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 11:51 AM