ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI: తొలి త్రైమాసికం ఆశాజనకంగా లేదు.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ అంచనా

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:11 AM

దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.

ఢిల్లీ: దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది. ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కాగా.. మొదటి త్రైమాసిక జీడీపీ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది.


కారణాలివే..

ఎస్‌బీఐ రీసెర్చ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ తాజా ఎకోవ్రాప్‌ నివేదిక ప్రకారం... ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం, లాభాల మార్జిన్లు తగ్గడం, పెరుగుతున్న ప్రపంచ సరకు రవాణా, సెమీకండక్టర్‌ కొరత, కంటైనర్‌ ఖర్చులు సహా అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఉండటంతో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని తెలిపింది. జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2024 భారత వృద్ధి 7 శాతం కంటే తక్కువగా 6.7 - 6.8 శాతానికి పెంచింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం గురించి ఆందోళనలు సహా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను కూడా నివేదిక హైలైట్ చేసింది. అయితే జులై ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాలు పుంజుకోవడంతో దేశానికి సానుకూల వృద్ధి ఉంటుందని తెలిపింది. వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది.


జీడీపీ అంటే...

ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి. జీడీపీ వృద్ధి చెందుతోందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని.

ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని, అవి సరైన దిశలో పయనిస్తున్నాయని. జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి వెళ్తోందంటే.. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని దాని అర్థం.

For Latest News click here

Updated Date - Aug 28 , 2024 | 11:11 AM

Advertising
Advertising
<