ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SEBI: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు సెబీ సూచనలు

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:56 AM

అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్(hindenburg report) మరో పరిశోధనా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటివల నేవిదికలో సెబీ(SEBI) చీఫ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆదివారం సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది.

sebi

అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్(hindenburg report) మరో పరిశోధనా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటివల నేవిదికలో సెబీ(SEBI) చీఫ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆదివారం సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ నివేదికపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, ఈ సమయంలో ప్రశాంతంగా ఉండాలని సెబీ పేర్కొంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌కి ఏదైనా ప్రతిస్పందన ఇవ్వడానికి ముందు పెట్టుబడిదారులు తగిన శ్రద్ధ వహించాలని సూచనలు జారీ చేసింది.


ఆరోపణలను

ఈ క్రమంలో హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలను సెబీ కొట్టిపారేసింది. అదానీ గ్రూప్‌(adani group)పై వచ్చిన ఆరోపణలను సెబీ తగిన విధంగా విచారించిందని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెగ్యులేటర్ 24 కేసుల్లో 22 కేసుల్లో దర్యాప్తు పూర్తైంది. మిగిలిన విచారణ కూడా చివరి దశలో ఉందని వెల్లడించింది. విచారణ పూర్తయిన కేసులపై చర్యలు ప్రారంభించారని, ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సెబీ 100కు పైగా సమన్లు, 1,100 లేఖలు, ఇమెయిల్‌లను జారీ చేసినట్లు స్పష్టం చేసింది.


నియంత్రణ

సెబీ ఛైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్‌కు మద్దతుగా విరుద్ధ ప్రయోజనాల సమస్యలను పరిష్కరించడానికి తగిన అంతర్గత నియంత్రణలు ఉన్నాయని మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. ప్రయోజనాల వైరుధ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సెబికి తగిన అంతర్గత నియంత్రణలు ఉన్నాయని వెల్లడించింది. సెక్యూరిటీల హోల్డింగ్ వాటి బదిలీకి సంబంధించి ఎప్పటికప్పుడు చైర్‌పర్సన్ ద్వారా బహిర్గతం చేయబడతయాన్నారు. ఒక బహుళజాతి ఫైనాన్సింగ్ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు SEBI ద్వారా వివిధ ఇతర అసెట్ క్లాస్‌లలో REITలు, SM REITల ప్రమోషన్ అనే వాదన అసంబద్ధమని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


సెబీ చీఫ్ ఏం చెప్పారు?

అంతకుముందు సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్(Madhabi Puri Buch), ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ విశ్వసనీయతపై హిండెన్‌బర్గ్ దాడి చేస్తోందని వారు అన్నారు.

హిండెన్‌బర్గ్ నివేదికలో

అదానీ మనీ సైఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన రెండు షాడో ఆఫ్‌షోర్ సంస్థలలో సెబీ ఛైర్‌పర్సన్ మధాబీ బుచ్, ఆమె భర్త వాటాలు కలిగి ఉన్నారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం ఆరోపించింది. అంతకుముందు ఈ అమెరికన్ సంస్థ జనవరి 2023లో ఒక నివేదికను ప్రచురించింది. దీనిలో అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. అయితే వాటిని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పూర్తిగా ఖండించారు.


ఇవి కూడా చదవండి:

Gold and Silver Rate Updates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..


Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 09:01 AM

Advertising
Advertising
<