Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
ABN, Publish Date - Oct 12 , 2024 | 01:46 PM
మీరు దీర్ఘకాలిక దృక్పథంతో ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. వీటిలో దీర్ఘకాలంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. దీనిలో సింగిల్ టైం పెట్టుబడి చేస్తే ఎంత మొత్తంలో వస్తుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో బ్యాంకుల వడ్డీ రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో వస్తున్న నేపథ్యంలో అనేక మంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కొంత మంది ప్రతి నెల సిప్ విధానంలో వారి స్థాయి మేరకు పెట్టుబడులు చేస్తుంటారు. ఇంకొంత మంది మాత్రం ఒకేసారి పెట్టుబడి చేసి వదిలేస్తారు. ఇప్పుడు సింగిల్ టైం పెట్టుబడి చేస్తే ఎంత మొత్తంలో వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సగటు వడ్డీ
మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి చేయడం ద్వారా ప్రారంభ రోజుల నుంచి దీర్ఘకాలిక దృక్పథంతో ఉంటే అది వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ పథకాల రాబడి గురించి మాట్లాడితే చాలా పథకాల దీర్ఘకాలిక సగటు రాబడి సంవత్సరానికి 12 శాతంగా ఉంది. మీరు పెట్టుబడులు చేయాలంటే అనేక ఆన్‌లైన్ సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. వాటి యాప్‌ల ద్వారా మీరు KYC సహా పలు వివరాలు పూర్తి చేసి కొన్ని నిమిషాల్లోనే పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
ఎంత వస్తుంది
మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ప్రకారం ఓ పెట్టుబడిదారుడు ఏకమొత్తంలో రూ. 12 లక్షలు పెట్టుబడి చేసినట్లైతే సగటు రాబడి సంవత్సరానికి 12 శాతం ఉంటే, రాబోయే 20 సంవత్సరాలలో అది రూ. 1,15,75,552 అవుతుంది. ఈ విధంగా పెట్టుబడిపై మీరు దాదాపు రూ. 1,03,75,552 కోట్ల రాబడిని పొందుతారు. ఈ విధంగా ఆ వ్యక్తి 25 సంవత్సరాల వయస్సులో మ్యూచువల్ ఫండ్‌లో రూ. 12 లక్షలు పెట్టుబడి చేస్తే ఆయన 45 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ఆయనకు కోటి రూపాయల 15 లక్షలు లభిస్తాయి. ఇక్కడ మీరు చేసిన పెట్టుబడి కేవలం రూ. 12 లక్షలు అయితే మీకు వచ్చేది మాత్రం కోటికిపైగా లభిస్తుంది.
ఆ మొత్తాన్ని
సగటు వడ్డీ రేటు పెరిగితే ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ మొత్తాన్ని పిల్లల పైచదువులు లేదా పెళ్లిళ్ల వంటి ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే కెరీర్ ప్రారంభంలోనే ఈ పెట్టుబడిని ప్రారంభించడం ద్వారా మీరు తక్కువ సమయంలో కాంపౌండింగ్ ద్వారా గణనీయమైన సంపదను దక్కించుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం చూస్తున్న క్రమంలో మీరు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. లార్జ్, మిడ్‌క్యాప్, ఫ్లెక్సిక్యాప్, మల్టీక్యాప్ ఫండ్ల నుంచి మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకాలలో కనీసం రెండు పోర్ట్‌ఫోలియోలో ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఇది పెట్టుబడి సలహా కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. మీరు పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది)
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 13 , 2024 | 09:44 AM