ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Starlink Internet Services: త్వరలో ఇండియాలో కూడా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.. వీటికి గట్టి పోటీ

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:34 PM

ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ సేవలు ఇండియాలో త్వరలో మొదలుకానున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్‌లకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను ఎలా కేటాయిస్తారనే విషయాన్ని పేర్కొన్నారు.

Starlink Internet Services

భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్ రాబోతుంది. అది ఏంటంటే ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ (Starlink Internet Services) ప్రవేశం ఇండియాలో దాదాపు ఖరారైంది. శాటిలైట్ స్పెక్ట్రమ్‌కు సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక విషయం తెలిపారు. స్టార్‌లింక్‌తో పాటు, ఎయిర్‌టెల్, జియో, అమెజాన్ కైపర్ భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం పోటీలో ఉన్నాయి. ఇప్పటికే శాటిలైట్ సర్వీస్ స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఎయిర్‌టెల్, జియో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.


ఈ రెండు కంపెనీలు

ఈ క్రమంలో శాటిలైట్ స్పెక్ట్రమ్ పంపిణీ భూగోళ మొబైల్ నెట్‌వర్క్‌ల మాదిరిగానే ఉండాలని ఈ రెండు కంపెనీలు కోరుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వాటాదారుల నుంచి కూడా అభిప్రాయాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలం 'ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్' తరహాలో ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను స్టార్‌లింక్ ప్రారంభించడం సులభం అవుతుంది.


స్పెక్ట్రమ్ వేలం

శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపులు 2జీ సర్వీస్‌ తరహాలో 'ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌' తరహాలో జరుగుతాయని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇండియా ఎకనామిక్ కాన్ఫరెన్స్ సందర్భంగా స్పెక్ట్రమ్ వేలం భౌతికంగా సాధ్యం కాదని కేంద్ర మంత్రి అన్నారు. స్పెక్ట్రమ్‌లో సైన్స్ ఇమిడి ఉందని, ఏ దేశం రేడియో తరంగాలను వేలం వేయలేదని కేంద్ర మంత్రి అన్నారు. శాటిలైట్ స్పెక్ట్రమ్‌ని వేలం వేయడం భౌతికంగా అసాధ్యమని ప్రపంచంలో ఏ దేశం అలా చేయడం లేదన్నారు.


ధరను TRAI నిర్ణయిస్తుంది

రానున్న రోజుల్లో స్పెక్ట్రమ్ ధరను TRAI నిర్ణయించనుంది. దాని ఆధారంగానే స్పెక్ట్రమ్ కేటాయింపు ఉంటుంది. స్పెక్ట్రమ్ సర్వీస్ లైసెన్స్ పొందిన ప్రతి వ్యక్తికి స్పెక్ట్రమ్ ఇవ్వబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్పెక్ట్రమ్ కేటాయింపులు ఫిజిక్స్ సిద్ధాంతం ఆధారంగా పరిపాలనాపరంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో స్టార్‌లింక్, అమెజాన్ కైపర్‌లకు మార్గం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే Jio, Airtel ఎల్లప్పుడూ వేలం ద్వారా స్పెక్ట్రమ్ కేటాయింపులను సమర్ధించాయి.


ఇవి కూడా చదవండి:

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 14 , 2024 | 03:34 PM