ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market: వరుసగా మూడో రోజూ భారీ లాభాలే.. లైఫ్‌టైమ్ హైని టచ్ చేసిన సెన్సెక్స్!

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:29 PM

ప్రధాని మోదీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టనుండడంతో దేశీయ సూచీలు లాభాల బాటలో పయనించాయి. ఎన్నికల రోజు ఎదురైన భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలు అందుకున్నాయి.

Stock Market

ప్రధాని మోదీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టనుండడంతో దేశీయ సూచీలు లాభాల బాటలో పయనించాయి. ఎన్నికల రోజు ఎదురైన భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలు అందుకున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం కూడా సూచీల సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. దీంతో హెవీ వెయిట్ స్టాక్స్ లాభాలు అందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ లైఫ్‌టైమ్ హై‌కు చేరుకుంది.


శుక్రవారం ఉదయం 75,031 వద్ద లాభాలతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా అదే దూకుడును కొనసాగించింది. 76,759 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. చివరకు 1618 పాయింట్ల లాభంతో 76,693 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 23,290 వద్ద స్థిరపడింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ వంటి కంపెనీల్లో కొనుగోళ్లు జరగడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది.


సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీలూ లాభాలను అందుకున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు బాగా లాభపడ్డాయి. మోట్రోపోలిస్, గ్లెన్‌మార్క్, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఒబెరాయ్ రియాలిటీ స్వల్పంగా నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ 511 పాయింట్లు లాభపడింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.38గా ఉంది.

ఇవి కూడా చదవండి..

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా


వచ్చే జూన్‌ నాటికి 82,000కు సెన్సెక్స్‌!


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2024 | 04:29 PM

Advertising
Advertising