Stock Market: ఎన్నికల ఫలితాల వేళ అప్రమత్తం.. సెన్సెక్స్ 3500 పాయింట్లు ఢమాల్!
ABN, Publish Date - Jun 04 , 2024 | 11:55 AM
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వస్తుండడం, ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ లభిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తమవుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వస్తుండడం, ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ లభిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తమవుతున్నారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్లకు పైగా కోల్పోయింది. సోమవారం భారీగా లాభపడిన అదానీ స్టాక్స్, పీఎస్‌యూలు మంగళవారం అదే స్థాయిలో పతనమయ్యాయి.
మంగళవారం ఉదయం 200 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ అమ్మకాలు వెల్లువెత్తడంతో నిమిషాల వ్యవధిలో 2000 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నట్టు కనిపించినప్పటికీ కొద్ది సేపటికి మరింత నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 11:45 గంటలకు సెన్సెక్స్ 3600 పాయింట్లకు పైగా కోల్పోయి 72,855 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ఏకంగా 1,115 పాయింట్లు కోల్పోయి 22,148 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 3200 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3400 పాయింట్లు కోల్పోయింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో చాలా వరకు 10 శాతానికి పైగా నష్టపోయాయి పవర్ ఫైనాన్స్ 20 శాతం, ఆర్‌ఈసీ 19 శాతం, భెల్ 19 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 18.50 శాతం కోల్పోయాయి. కేవలం ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. డాబర్ ఇండియా, హెచ్‌యూఎల్, కొల్గేట్, మారికో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Updated Date - Jun 04 , 2024 | 11:55 AM