Stock Market Updates: నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి దూకిన స్టాక్ మార్కెట్లు.. ఇలాగే ఉంటాయా లేదా?
ABN, Publish Date - Feb 27 , 2024 | 10:17 AM
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు స్వల్ప క్షీణతతో ప్రారంభమయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు స్వల్ప క్షీణతతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72,800, నిఫ్టీ 22100 స్థాయిల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్‌లో బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల్లో స్వల్ప క్షీణత నమోదవుతుండగా, ఐటీ రంగంలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బలహీనమైన గ్లోబల్ సిగ్నల్స్ కారణంగా ఈరోజు మార్కెట్ మందకొడిగా మొదలైంది. అంతకుముందు సోమవారం సెన్సెక్స్ 352 పాయింట్లు నష్టపోయి 72,790 వద్ద ముగిసింది.
ఈ నేపథ్యంలో TCS, పవర్ గ్రిడ్ కార్ప్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, HDFC లైఫ్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా.. టాప్ 5 లూజర్లలో యూపీఎల్, ONGC, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ సంస్థల స్టాక్స్ ఉన్నాయి. డిజిటల్ వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి విప్రో, నోకియా ఉమ్మడి 5G ప్రైవేట్ వైర్‌లెస్ సొల్యూషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే విప్రో స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో 0.62% పెరిగి రూ.536.20 వద్ద ట్రేడవుతోంది. లెమన్ ట్రీ హోటల్స్ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో 1.13% పెరిగింది.
మరోవైపు జపాన్‌కు చెందిన నిక్కీ 225 0.3 శాతం పెరగగా, టాపిక్స్ 0.1 శాతం పెరిగింది. దక్షిణ కొరియా కోస్పి 0.1 శాతం, కోస్‌డాక్ 0.3 శాతం పడిపోయాయి. మరోవైపు GIFT నిఫ్టీ 22,151 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. అయితే నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపు 22,138 వద్ద ఉంది. ఇక యూఎస్ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచిక అయిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 62.30 పాయింట్లు లేదా 0.16 శాతం పడిపోయి 39,069.23 వద్దకు చేరుకోగా, S&P 500 19.27 పాయింట్లు లేదా 0.38 శాతం పడిపోయి 5,069.53 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 20.57 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 15,976.25 వద్దకు చేరుకుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పీపీబీఎల్ చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
Updated Date - Feb 27 , 2024 | 10:17 AM