ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Markets: చంద్రబాబు వ్యాఖ్యలతో లాభాల పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్లు

ABN, Publish Date - Jun 05 , 2024 | 03:06 PM

లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో బీజేపీకి మ్యాజిగ్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్ నింపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయేతో కలిసి నిబద్ధతతో పయనిస్తామని, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో బీజేపీకి మ్యాజిగ్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్ నింపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయేతో కలిసి నిబద్ధతతో పయనిస్తామని, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం ఉదయం సెషన్‌లో స్వల్ప లాభాలతో ఆరంభమైన మార్కెట్లు.. చంద్రబాబు వ్యాఖ్యాలతో ఒక్కసారిగా భారీ లాభాల బాటపడ్డాయి. ర్యాలీ కొనసాగుతూ సాయంత్రం 3 గంటల సమయానికి దేశీయ ఈక్విటీ సూచీలు 3 శాతానికిపై వృద్ధి చెందాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,318 పాయింట్లు (3.22 శాతం) శాతం బలపడి 74,3971.88 వద్ద తాచ్చాడింది. ఇక నిఫ్టీ-50 సూచీ 770 పాయింట్లు (3.52 శాతం) మేర లాభపడి 22,655.40 వద్ద ట్రేడ్ అయ్యింది.


నిఫ్టీ-50 సూచీపై ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెటిరోమోటో కార్ప్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ సూచీలు అత్యధిక లాభదార్లుగా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్‌లీవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏసియన్ పెయింట్స్‌తో పాటు పలు షేర్లు బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌పై లాభపడ్డ స్టాకుల జాబితాలో ఉన్నాయి.


మంగళవారం ‘మహా పతనం’

కాగా మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సింగిల్‌గా మ్యాజిగ్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం పలు ఊహాగానాలు వెలువడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌లతో ఇండియా కూటమి సంప్రదింపులు మొదలుపెట్టిందంటూ కొన్ని జాతీయ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అవాస్తవ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఊహాగానాలు స్టాక్ మార్కెట్లలో కలకలం రేపాయి. ఎన్డీయే కూటమి ఏర్పాటుపై మదుపర్లు సందేహించారు. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి. ప్రధాన సూచీలు గత నాలుగేళ్లలో అత్యధిక పతనాన్ని చవిచూశాయి. బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 4,390 పాయింట్లు నష్టపోయి 72,079 స్థాయి వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒకానొక దశలో 6,234 పాయింట్లు పతనమై 70,000 స్థాయికి జారుకుంది. దీంతో మంగళవారం మదుపర్లు ఏకంగా రూ.31 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఒకానొక దాదాపు రూ.40 లక్షల కోట్ల సంపద కరిగిపోయిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 05 , 2024 | 03:09 PM

Advertising
Advertising