Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
ABN, Publish Date - Apr 13 , 2024 | 10:59 AM
మీకు ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ తక్కువ పెట్టుబడితో ప్రారంభించే బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఈ వ్యాపారం క్లిక్ అయితే ఇక మళ్లీ మీరు జాబ్ జోలికి వెళ్లాల్సిన పనిలేదు.
మీకు ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ తక్కువ పెట్టుబడితో ప్రారంభించే బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఈ వ్యాపారం క్లిక్ అయితే ఇక మళ్లీ మీరు జాబ్ జోలికి వెళ్లాల్సిన పనిలేదు. అయితే ఈ వ్యాపారం ఏటంటే ఫుడ్ వ్యాపారం(food business). దీనిని అంత సులవుగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ వ్యాపారం నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఇటివల హైదరాబాద్(hyderabad)లో కుమారి ఆంటీ కూడా ఇదే వ్యాపారం చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎలా ప్రారంభించాలి, ఏం తీసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రజలు(people) ఎక్కువగా సంచరించే ప్రాంతాలను ఎంచుకోవాలి. అంతేకాదు అక్కడ మీకు పోటీగా ఏదైనా టిఫిన్ సెంటర్ లేదా హోటల్స్ వంటివి ఉన్నాయా లేదా అనేది కూడా చుసుకోవాలి. ఆ తర్వాత ఉదయం ఫుడ్ విక్రయించాలా లేదా సాయంత్రం స్నాక్స్ అమ్మాలా లేదా మధ్యాహ్నం లేక రాత్రి భోజనం సేల్ చేయాలా అనేది మన వీలును బట్టి నిర్ణయించుకోవాలి. ఇటివల రాత్రి సమయాల్లో కూడా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో ఫుడ్ సహా స్నాక్స్ కూడా సేల్ చేస్తూ సంపాదిస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నారు.
అయితే ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలంటే పెద్దగా ఖర్చు(expenses) అక్కర్లేదు. మీరు చేయాల్సిన వంటకాలను బట్టి ఖర్చు ఉంటుంది. దీంతోపాటు ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతంలో షాపు అద్దెకు తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఏదైనా రద్దీగా ఉండే ప్రాంతంలోని షాపుల పక్కన పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకుంటే 50 వేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీరు మీల్స్, స్నాక్స్, నాన్ వెజ్ కర్రీలను ఇంటి వద్ద తయారు చేసి మార్కెట్ లేదా మీరు ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో విక్రయించుకోవచ్చు.
ఆ విధంగా మీరు రోజుకు 200 మంది కస్టమర్లకు(customers) అమ్మినా కూడా ఒక్కరి నుంచి కనీసం 20 రూపాయల లాభం వేసుకుంటే రోజుకు నాలుగు వేల రూపాయల చొప్పున సంపాదించవచ్చు. నాన్‌వెజ్ వంటకాల్లో ఎక్కువ లాభం ఉంటుంది. ఇలా నెల చొప్పున లెక్కకడితే లక్షా 20 వేలకుపైగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా రోజు మొత్తం పని చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక సమయంలో ఈ వ్యాపారం ఏర్పాటు చేసుకుని మిగతా సమయంలో ఇంకేదైనా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 11:05 AM