Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?
ABN, Publish Date - Jul 27 , 2024 | 10:01 AM
స్టాక్ మార్కెట్(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్‌పై ఇన్‌వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే షేర్ మార్కెట్ గురించి తెలుసుకుని దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్‌పై ఇన్‌వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా కంపెనీల షేర్ ప్రైస్ అమాంతం పెరిగితే కొన్ని నెలల్లోనే ధనవంతులు కావచ్చని అంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. అలా అని ఇదేం పెన్నీ స్టాక్ కాదు. ప్రముఖ కంపెనీ టాటా గ్రూపు(tata group)నకు చెందిన షేర్. ఇది ఏడాదిలోనే పెట్టుబడిదారులకు దాదాపు 67 శాతం లాభాలను అందించింది. అంటే వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే 1,670 రూపాయలు వచ్చాయి.
గరిష్టానికి
అదే టాటా మోటార్స్(tata motors) స్టాక్. ఇటివల ఈ సంస్థ మొత్తం మార్కెట్ విలువ తొలిసారిగా రూ.4 లక్షల కోట్లు దాటింది. అంతకుముందు కంపెనీ విలువ రూ.3.63 లక్షల కోట్లుగా ఉండేది. ఈ వారంలో ఈ షేరు ధర రూ. 128.5 లేదా 13.0 శాతం లాభపడి ఒక్కో షేరుకు రూ. 1,118.4 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో గత ఏడాది కాలంలో టాటా మోటార్స్ షేర్లు 67 శాతం రాబడిని ఇచ్చాయి. గత 2 సంవత్సరాలలో ఈ స్టాక్ దీని పెట్టుబడిదారులకు 137 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 25న ఈ షేర్ ప్రైస్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.593.50 వద్ద ఉండగా, అదే సమయంలో ఈ రోజు స్టాక్ ప్రైస్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది.
ఏడాదిలోనే
ఇలా చూస్తే ఏడాది క్రితం ఈ షేర్లను కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం లక్షాధికారులు(rich) అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ షేర్ ధర రూ.593.50 వద్ద ఓ రెండు వేల షేర్లు కొనుగోలు చేసిన వారి పెట్టుబడి వ్యయం రూ.11,87,000. కానీ ఇప్పుడు ఆ షేర్ల ధరలు రూ. 1,118.4కు చేరుకున్నాయి. దీంతో ఆ పెట్టుబడి మొత్తం ఇప్పుడు రూ.22, 36,800కు చేరుకుందని చెప్పవచ్చు. అంటే దాదాపు పెట్టిన పెట్టుబడి ఏడాది కాలంలోనే డబుల్ అయ్యింది. 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఏడాదిలోపే వచ్చిన లాభం 10,49,800 రూపాయలు. అయితే ఇలా దీర్ఘకాలంలో అన్ని కంపెనీల స్టాక్స్ మాత్రం పెరుగుతాయని చెప్పలేం.
భవిష్యత్ ఎలా?
లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మెరుగైన స్థితి కారణంగా టాటా మోటార్స్ షేరు ధరను గణనీయంగా పెంచవచ్చని బ్రోకరేజ్ సంస్థ నోమురా(nomura) ఇటివల పేర్కొంది. ఈ క్రమంలో నోమురా టాటా మోటార్స్ షేర్ల టార్గెట్ ధరను రూ.1141 నుంచి రూ.1294కి పెంచింది. దీంతో ఈ కంపెనీ షేర్ల ధరలు క్రమంగా పుంజుకున్నాయి. అంతేకాదు టాటా మోటార్స్ ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత టాటా గ్రూప్‌లో రెండవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది.
2025 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ EBIT మార్జిన్ 8.5 శాతం పెరగవచ్చని, 2027 FY నాటికి 10.1 శాతానికి పెరగవచ్చని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది. ఆ ప్రకారం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 11-12 శాతం జంప్‌ను చూడవచ్చన్నారు. ఎఫ్‌వై 24 మార్చి త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.17,407 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి:
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?
Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 27 , 2024 | 10:04 AM