ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TCS: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీసీఎస్ గుడ్‌న్యూస్

ABN, Publish Date - Mar 29 , 2024 | 04:08 PM

ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్‌లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.

న్యూఢిల్లీ: ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్‌లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది. ‘మనీ కంట్రోల్‌’ రిపోర్ట్ ప్రకాురం.. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 10గా ఉంది. ఇక ఏప్రిల్ 26న టెస్ట్ జరుగుతుందని పేర్కొంది. 2024కి చెందిన బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్‌ల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.


కాగా టీసీఎస్ నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల కోసం టీసీఎస్ ఈ నియామకాలు చేపట్టనుంది. నింజా కేటగిరిలో వేర్వేరు రోల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు రూ.3.36 లక్షల వార్షిక ప్యాకేజీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇక డిజిటల్, ప్రైమ్ కేటగిరీలలో రూ.7 లక్షలు, రూ.9-11.5 లక్షల వరకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే టీసీఎస్ ఎంతమంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోబోతోందనే దానిపై స్పష్టత రాలేదు.


కాగా నియామకాలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుందని ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రెషర్ల నియామకం కోసం ఎదురుచూస్తున్నామని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. నియామకాల సంఖ్యను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే పెద్ద సంఖ్యలో భర్తీ ఉంటుందని నిర్ధారించారు. ఇదిలావుండగా కొవిడ్ తర్వాత నియామకాలు మందగించాయి. దీంతో ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్ల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Deadline: వీటికి మార్చి 31 గడువు.. త్వరగా పూర్తి చేయండి, లేదంటే మీకే నష్టం

Credit Cards: ఒక్కరోజే రూ.500 కోట్లు కోల్పోయిన క్రెడిట్ కార్డ్ యూజర్లు.. ఈ మోసం తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 04:10 PM

Advertising
Advertising