Software Engineers: 5 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్..ఇందుకేనా!
ABN , Publish Date - Jan 16 , 2024 | 02:35 PM
దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు(software Engineers) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో 'AI.Cloud' యూనిట్ హెడ్ శివ గణేశన్ ఈ మేరకు వెల్లడించారు. వ్యాపార ఉత్పాదక పెంచుకునే క్రమంలో AI ప్రస్తుతం ప్రారంభ దశల్లో ఉందని అన్నారు. కానీ రాబోయే రోజుల్లో దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: CAIT: రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం..దేశంలో లక్ష కోట్ల వ్యాపారం!
Gen AI నుంచి సమాచారాన్ని సేకరించి కస్టమర్ల పనిని వేగవంతం చేయడానికి కంపెనీ ప్రస్తుతం ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు. కంపెనీ కొన్ని నెలల క్రితం 250 జనరేటివ్ AI పవర్డ్ ప్రాజెక్ట్‌లలో దీనిని ఉపయోగించినట్లు తెలిపింది. క్రమంగా దీని ద్వారా పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. దీని నిజమైన ఫలితాలు రానున్న త్రైమాసికాల్లో వెల్లడి కానున్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో మొత్తం సంస్థ స్వయంగా (Gen) AI వినియోగం కోసం సిద్ధమైనట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఏడు నెలల్లో దాదాపు 1.50 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు AI.Cloud యూనిట్ హెడ్ శివ గణేశన్ చెప్పారు.