Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే
ABN, Publish Date - Aug 07 , 2024 | 02:29 PM
ప్రాపర్టీ యజమానులకు(property owners) గుడ్ న్యూస్ వచ్చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలలో ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించింది. జులై 23న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలను మార్చారు.
ప్రాపర్టీ యజమానులకు(property owners) గుడ్ న్యూస్ వచ్చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(tax) నిబంధనలలో ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. జులై 23న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలను మార్చారు. ఆ క్రమంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. కానీ ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని రద్దు చేశారు. ఈ మార్పుతో రియల్ ఎస్టేట్ రంగం నిరాశ చెందింది. ఈ క్రమంలోనే తాజాగా పన్ను చెల్లింపుదారులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో 12.5 శాతం నుంచి 20 శాతం పన్ను రేటును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆగస్టు 6న తెలిపింది.
మూలధన లాభాలపై
ఏదైనా పన్ను చెల్లింపుదారులు ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కోరుకుంటే వారు 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(long term capital gains tax) చెల్లించాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పొందకూడదనుకుంటే, వారు దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాలని వెల్లడించింది. ఈ అవకాశం పన్ను చెల్లింపుదారులు జులై 23కి ముందు విక్రయించిన ఆస్తి విషయంలో మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర బడ్జెట్‌లో ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని ప్రభుత్వం తొలగించిన తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీలు నిరాశ చెందాయి. ఈ విషయమై పరిశ్రమల ప్రతినిధులు ఆర్థిక శాఖ అధికారులను కలిసి తమ సమస్యలను తెలిపారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ సడలింపు
దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని కోసం ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2024ను సవరించింది. ప్రభుత్వం పన్ను నిబంధనలలో మార్పులు చేసినప్పుడు దానిని పార్లమెంటు(parliament)లో ఆమోదించాలి. ఫైనాన్స్ బిల్లులో ప్రభుత్వం కొన్ని విషయాలపై కస్టమ్, ఎక్సైజ్ సుంకాన్ని కూడా సవరించిందని చెబుతున్నారు. ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలలో ప్రభుత్వం సడలింపు నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉపశమనం పొందుతాయి. కానీ జులై 23కి ముందు తమ ఆస్తులను విక్రయించడం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాలను ఆర్జించిన చాలా మంది ఆస్తి యజమానులకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇండెక్సేషన్ ప్రయోజనం అంటే ఏమిటి?
ఇండెక్సేషన్ ప్రయోజనాల(indexation benefit) కారణంగా ఆస్తి కొనుగోలు ధర పెరుగుతుంది. వాస్తవానికి ఇండెక్సేషన్ కింద ఆస్తి కొనుగోలు ధర ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయబడుతుంది. ఉదాహరణకు మీరు 15 సంవత్సరాల క్రితం రూ. 10,00,000 పెట్టి ఒక ఆస్తిని కొన్నారనుకుందాం. మీరు దీన్ని ఈ ఏడాది జూలై 1న రూ. 20,00,000కి విక్రయించారు. ఈ విధంగా మీ మూలధన లాభం రూ. 10,00,000 వస్తుంది. కానీ ఇండెక్సేషన్ ప్రయోజనం కారణంగా మీ రూ.10,00,000 కొనుగోలు ధర రూ.14,000కి పెరుగుతుంది. దీని కారణంగా మీ మూలధన లాభం రూ. 6 లక్షలకు మాత్రమే తగ్గుతుంది. ఆ క్రమంలో వచ్చిన లాభంపై విధించే పన్ను కూడా తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 07 , 2024 | 02:31 PM