ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ABN, Publish Date - Mar 19 , 2024 | 04:45 PM

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఆపదలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది కావడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎంపిక చేసుకున్న టైమ్ పీరియడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఆపదలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో దేశంలో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ (Investment) రిస్క్‌తో కూడుకున్నది కావడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FiXed Deposit) పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎంపిక చేసుకున్న టైమ్ పీరియడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని మెచ్యూరిటీ వ్యవధి కంటే ముందే విత్‌డ్రా చేయడం కుదరదు. అలా చేస్తే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు ఎన్నువ ప్రయోజనాలు పొందుతారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకటే వడ్డీ రేట్లను చెల్లించవు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు ఓపెన్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పెట్టుబడి పెట్టేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది.

ఖాతా ఎలా తెరవాలి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవాలంటే అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు సంబంధించిన దరఖాస్తు పూర్తి చేయాలి. ఫిక్స్‌డ: డిపాజిట్ ద్వారా పొదుపు చేయాలనుకుంటున్న మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ముందే నగదు తీసుకుంటే..

నిర్ణీత వ్యవధి కంటే ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన మొత్తం విత్‌డ్రా చేయాలనుకుంటే ఖాతాదారుడికి కొంతమేర నష్టం వస్తుంది. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే.. దాని మెచ్యూరిటీ తర్వాత మాత్రమే ఆ అమౌంట్ తీసుకునే వీలుంటుంది. ఒకవేళ నిర్ణీత సమయానికి మీరు మీ డిపాజిట్ తీసుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెచ్యూరిటీ కాలం పూర్తైన తర్వాత ఎన్ని రోజులైతే మీరు అదనంగా డిపాజిట్ చేసి ఉంచారో.. అప్పటివరకు వడ్డీ లెక్కించి చెల్లిస్తారు.

వడ్డీపై పన్ను

ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌పై పన్ను విధిస్తారు. వడ్డీ మొత్తం రూ.10వేల వరకు ఉంటే అందుకున్న మొత్తంపై బ్యాంక్ 10.3% పన్ను తీసుకుంటుంది. వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయిల కంటే ఎక్కువ ఉంటే మరింత ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80టిటిబి కింద ఫిక్స్‌డ: డిపాజిట్లపై వడ్డీ రూపంలో సంపాదించిన ఆదాయంపై రూ.50వేల వరకు తగ్గింపు పొందుతారు. పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 04:45 PM

Advertising
Advertising