Share News

Gold And Silver Price: దిగొస్తోన్న బంగారం.. ధర ఎంతంటే

ABN , Publish Date - Oct 09 , 2024 | 09:35 AM

పండగ వేళ పసిడి ధర దిగొస్తోంది. నిన్నటి కన్నా ధర మరి కాస్త తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Gold And Silver Price: దిగొస్తోన్న బంగారం..  ధర ఎంతంటే
Gold And Silver Rates,

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ శోభ వచ్చేసింది. ఇంటిల్లిపాదిలి కొత్త బట్టలు కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు. లేడీస్ కలెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారం, వెండి నగలంటే పడి చస్తారు. పండగ వేళ బంగారం ధర దిగి వస్తోంది. దాంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు మహిళలు షాపులకు క్యూ కడుతున్నారు.


gold-2.jpg


హైదరాబాద్‌లో ఇలా..

హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ.10 తగ్గి రూ.70,990 వద్ద ఉంది. 24 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 77,440 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదే విధంగా ధరలు ఉన్నాయి.


gold.jpg


ఢిల్లీలో ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 77,100గా ఉంది. వెండి ధర మాత్రం పెరిగింది. గత 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97 వేలు ఉంది. హైదరాబాద్‌లో రూ.లక్ష 3 వేలు ఉంది. బంగారం, వెండి ధరలు అప్పటికప్పుడు మారుతుంటాయి. అదేవిధంగా బంగారం, వెండికి సంబంధించి జీఎస్టీ, స్థానిక పన్నులను బట్టి మారుతూ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Oct 09 , 2024 | 09:35 AM