Gold Rates: తగ్గిన బంగారం ధర
ABN, Publish Date - Jul 31 , 2024 | 07:39 AM
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆషాడ మాసం కావడంతో పసిడి ధర తగ్గుతూ.. పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది. వచ్చేది శ్రావణ మాసం అయినందున పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు ముందే బంగారం కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్: బంగారం ధరలు (Goldrates) కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆషాడ మాసం కావడంతో పసిడి ధర తగ్గుతూ.. పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది. వచ్చేది శ్రావణ మాసం అయినందున పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు ముందే బంగారం కొనుగోలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..!!
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,190గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.50 తగ్గింది. మేలిమి బంగారం ధర మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాములు బంగారం ధర రూ.68, 940గా ఉంది. నిన్న 68,990 ఉండే.. ఈ రోజు రూ.40 పెరిగింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,190గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,940గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,190గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,940గా ఉంది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 63,190 | 68,940 |
విజయవాడ | 63,190 | 68,940 |
విశాఖపట్టణం | 63,190 | 68,940 |
ఢిల్లీ | 63,340 | 69,090 |
ముంబై | 63,190 | 68,940 |
ఢిల్లీ, ముంబైలో ఇలా..!!
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,340గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.69,090గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,190గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.68,940గా ఉంది. వెండి ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. అన్ని ప్రధాన నగారల్లో కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ.84,600గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.88,900గా పలుకుతోంది.
Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 31 , 2024 | 01:42 PM