Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:07 PM
స్విగ్గీ(Swiggy) ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) పరిమాణాన్ని పెంచబోతోంది. కంపెనీ ఇప్పుడు తన IPOలో కొత్త షేర్ల విక్రయం ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ పరిమాణం రూ.3,750 కోట్లుగా ఉండేది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్(stock market) పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్. ప్రతి నెల కూడా ఎదో ఒక ఐపీఓ మదుపర్లకు మంచి లాభాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రముఖ ఫుడ్ టెక్ కంపెనీ స్విగ్గీ(Swiggy) తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) పరిమాణాన్ని పెంచబోతోంది. కంపెనీ ప్రస్తుతం తన IPOలో కొత్త షేర్ల విక్రయం ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ పరిమాణం రూ.3,750 కోట్లుగా ఉంది. ఈ సమాచారం ప్రకారం స్విగ్గీ మునుపటి అంచనా ప్లాన్ కంటే రూ. 1,250 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ పెరుగుదల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పోటీలో తనను తాను బలోపేతం చేసుకునేందుకు పెంచినట్లు తెలుస్తోంది.
లక్ష్యం ఎంత
అంతకుముందు Swiggy తన IPO ద్వారా సుమారు రూ.10,400 కోట్లు ($1.25 బిలియన్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు రూ.3,750 కోట్లు కొత్త షేర్ల విక్రయం, రూ.6,664 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా సమీకరించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అక్టోబరు 3న జరగనున్న సర్వసభ్య సమావేశంలో (EGM) కొత్త ప్రతిపాదనను బోర్డు ఆమోదిస్తే, IPO మొత్తం పరిమాణం $1.4 బిలియన్లకు పెరుగుతుంది. అయితే ఈ వార్తలపై స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పెరిగిన ఆదాయం
2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,265 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ తన నష్టాలను 44 శాతం తగ్గించుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,350 కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ. 4,179 కోట్లు. కంపెనీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంలో సహాయపడింది.
పెరుగుతున్న పోటీ
ప్రస్తుతం మార్కెట్లో జొమాటో, బ్లింకిట్ వంటి ప్రత్యర్థులతో పోటీ పెరిగిన నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ లాభాలను అధిగమించాలని Swiggy ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్‌లో స్విగ్గి తన డ్రాఫ్ట్ IPO పేపర్‌లను దాఖలు చేసింది. ఆ క్రమంలోనే Zomato, Blinkit రెండూ తమ లాభదాయకతను పెంచుకున్నాయి. ఈ క్రమంలోనే జెప్టో వంటి కొత్త కంపెనీ గత రెండు నెలల్లో 1 బిలియన్ డాలర్ల నిధులను సేకరింపచి మార్కెట్లో తమ పట్టును బలోపేతం చేసుకుంది. అంతేకాదు వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా పోటీ మరింత తీవ్రమైంది.
ఇవి కూడా చదవండి
Viral News: ఈ హీరోయిన్లతో స్టార్ క్రికెటర్ డేటింగ్?.. నెట్టింట పిక్స్ వైరల్
Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read MoreBusiness News and Latest Telugu News
Updated Date - Sep 10 , 2024 | 01:08 PM