ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali Offer: దీపావళి సందర్భంగా టయోటా నుంచి సరికొత్త ఆఫర్.. కస్టమర్ల కోసం..

ABN, Publish Date - Oct 17 , 2024 | 05:15 PM

దీవాళి పండుగ సందర్భంగా టయోటా స్పెషల్ టైసర్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిలో కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Toyota Taisor limited edition

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా దీపావళి సందర్భంగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీ తన కాంపాక్ట్ SUV టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ పరిమిత ఎడిషన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. Taisor ఈ కొత్త ఎడిషన్ అక్టోబర్ 31 వరకు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే గొప్ప SUV అని వెల్లడించింది. దీంతో క్రూయిజర్ టేజర్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.


మార్పులు

టయోటా టేజర్ కొత్త ఎడిషన్‌లో ఇంటీరియర్‌తో పాటు ఎక్ట్సీరియర్‌లో కూడా కొత్త మార్పులు చేయబడ్డాయి. ఈ కొత్త మోడల్‌లో రూ.20,000 కంటే ఎక్కువ విలువైన టొయోటా యాక్సెసరీలను అందిస్తున్నారు. దీంతోపాటు టయోటా టేజర్ ఎక్సిటీయర్‌లో కూడా మార్పులు చేశారు. హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ గ్రిల్, కారు సైడ్ మోల్డింగ్‌లు క్రోమ్‌తో అలంకరించబడ్డాయి. దీని సహాయంతో ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది కాకుండా టేజర్ లోపలి భాగంలో డాక్ వైజర్‌లు, ఆల్ వెదర్ 3డీ మ్యాట్‌లు, డోర్ ల్యాంప్స్ అందించారు.


లిమిటెడ్ ఎడిషన్ ధర ఎంత?

ఇక దీని ధర గురించి మాట్లాడితే టయోటా టేజర్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.56 లక్షల నుంచి మొదలై రూ. 12.88 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో లభిస్తుంది. టయోటా టేజర్‌లో అమర్చబడిన ఈ ఇంజన్ 100 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది.


రెండు రకాలుగా

ఇది కాకుండా టయోటా టేజర్ మరో మోడల్ గురించి మాట్లాడినట్లయితే ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 90 hp శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇంజన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ CNG పవర్డ్ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 78 hp శక్తిని అందిస్తుంది. టేజర్ లిమిటెడ్ ఎడిషన్ టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్‌ను పోలి ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్ ఆధారంగా ఈ పండుగ సీజన్‌లో కంపెనీ తన అమ్మకాలను పెంచాలనుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..


Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..

Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్


Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 17 , 2024 | 05:16 PM